Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యో- కిడ్నాప్ ప్లాన్‍తో రూ. 30 కోట్లు డిమాండ్

Published : Apr 20, 2026, 08:58 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 20వ తేదీ)లో జ్యోత్స్నను కిడ్నాప్ చేసిన వైరా. దశరథకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన వైరా. కంగారులో శివన్నారాయణ ఫ్యామిలీ. మరోసారి వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్‌ లో జ్యోత్స్న కారులో వెళ్తుంటే రోడ్డు మీద కారు అడ్డంగా పెడతాడు వైరా. కారు ఎవరు అడ్డంగా పెట్టిందని కోపంగా అంటుంది జ్యోత్స్న. నేనే మేడం అంటూ కారులో నుంచి దిగి జ్యోత్స్న కారులో ఎక్కుతాడు వైరా. నువ్వా జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చావు అంటుంది జ్యోత్స్న. 

పదా నీతో పనుంది అంటాడు వైరా. గన్ తీసి వైరాకు గురి పెడుతుంది జ్యోత్స్న. అదే గన్ లాక్కొని జ్యోత్స్నకు గురి పెడతాడు వైరు. నిన్ను మోసం చేసింది నేను కాదు మా బావ అంటుంది జ్యోత్స్న. నాకు అన్నీ తెలుసు.. నీతో చాలా మాట్లాడాలి పదా అంటాడు వైరా. ఎక్కడికి అని అడుగుతుంది జ్యోత్స్న. నేను నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను అంటాడు వైరా. నేనేంటీ వీడి దగ్గర ఇలా ఇరుక్కున్నాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

28
జ్యోత్స్న కిడ్నాప్

వైరా జ్యోత్స్నను ఓ చోటుకి తీసుకెళ్లి, కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేస్తాడు. అసలు నీకేం కావాలి, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావ్ అని అడుగుతుంది జ్యోత్స్న. 20 కోట్ల రూపాయలు కావాలి. మీ నాన్నకు ఫోన్ చేసి అడుగుతాను. నా పేరు చెప్పకుండా డబ్బులు తెప్పిస్తే నువ్వు బతుకుతావు. లేదంటే నిన్ను చంపేస్తానని అంటాడు వైరా.

38
ఫ్యామిలీ షాక్

ఆ తర్వాత దశరథకు ఫోన్ చేసి నీ కూతురుని కిడ్నాప్ చేశామని చెప్తాడు వైరా. నా కూతురు ఇంట్లోనే ఉంది అంటాడు దశరథ. ఆ తర్వాత జ్యోత్స్నను కట్టేసి ఉంచిన వీడియో పంపిస్తాడు వైరా. దాంతో అంతా కంగారు పడతారు. ఎవరు నువ్వు నీకు ఏం కావాలి అని అడుగుతాడు దశరథ. నాకు ఏం కావాలో చెప్తాను కానీ.. నీ కూతురు వాళ్ల అమ్మతో మాట్లాడాలంటా.. నేను మళ్లీ ఫోన్ చేస్తాను... ఈ సారి ఆవిడకు ఫోన్ ఇవ్వండి అని చెప్తాడు వైరా. సుమిత్రకు జ్యోత్స్న కిడ్నాప్ గురించి తెలిస్తే తట్టుకోలేదు అని కంగారు పడతాడు దశరథ. 

48
దాసు కంగారు

ఈ రోజు జ్యోత్స్న గురించి నువ్వు చాలాసార్లు అడిగావు. ఇది నువ్వు ముందే ఊహించావా దీప అని అడుగుతాడు కార్తీక్. లేదు బావ నేను నార్మల్ గానే అడిగాను అంటుంది దీప. కిడ్నాప్ ఎవరు చేసి ఉంటారు అని అడుగుతుంది పారు. నాకేం తెలుసు అంటాడు కార్తీక్. అంతలో దాసు ఫోన్ చేస్తే, జ్యోత్స్న కిడ్నాప్ గురించి చెప్తాడు కార్తీక్. వెంటనే ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దాసు.

58
సుమిత్ర ఏడుపు

నువ్వు ఈ మధ్య ఎవరితో అయినా గొడవపడ్డావా దశరథ అని అడుగుతాడు శివన్నారాయణ. ఒకరి పేరు చెప్తాడు దశరథ. అయితే వాడే చేసి ఉంటాడు అంటాడు కార్తీక్. వాడికి అంత సీన్ లేదురా అంటాడు శివన్నారాయణ. అసలు ముందు ఈ విషయాన్ని సుమిత్రతో ఎలా చెప్పాలి అంటాడు దశరథ. అంతలో సుమిత్ర వచ్చి ఏ విషయం అండీ అంటుంది. సుమిత్రను నెమ్మదిగా కూర్చోబెట్టి, జ్యోత్స్న కిడ్నాప్ గురించి చెప్తాడు కార్తీక్. అది చూసి సుమిత్ర కంగారు పడుతుంది. తనకు ఏమైందని ఏడుస్తుంది.

68
జ్యో ఎమోషనల్

అంతలో మళ్లీ కాల్ చేస్తాడు వైరా. ఈ సారి సుమిత్రతో జ్యోత్స్నను మాట్లాడిస్తాడు. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు మమ్మీ.. ముఖాలు కనబడకుండా మాస్క్ పెట్టుకున్నారు. నా పెళ్లి చూడాలని నువ్వు ఆశపడ్డావు. కానీ అది జరిగేలా లేదు. వీళ్లు నన్ను బ్రతకనివ్వరు అని ఎమోషనల్‌గా మాట్లాడుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఫోన్ లాక్కొని కట్ చేస్తాడు వైరా.

78
రూ. 30 కోట్లు డిమాండ్

కాసేపటికి మళ్లీ కాల్ చేస్తాడు వైరా. నా కూతురుని వదిలేయాలంటే నీకు ఏం కావాలి అని అడుగుతుంది సుమిత్ర. 30 కోట్ల రూపాయలు కావాలి. నేను చెప్పిన చోటుకి, చెప్పిన టైంకి తీసుకొస్తే చాలు.. లేకుంటే నీ కూతురుని చంపేస్తాను అంటాడు వైరా. నా కూతురిని ఎలాగైనా కాపాడండి అని దశరథ చేతులు పట్టుకొని ఏడుస్తుంది సుమిత్ర.

88
వైరాతో చేతులు కలిపిన జ్యో

మరోవైపు అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటావా అని జ్యోత్స్న అడుగుతాడు వైరా. కచ్చితంగా అవుతుంది.. 30 కోట్లు 50 కోట్లు అడిగినా ఇస్తారు అంటుంది జ్యో. అంటే అప్పటికే జ్యోత్స్న వైరాతో చేతులు కలిపి ఉంటుంది. నేను నిన్ను అడ్డం పెట్టుకొని 20 కోట్లు లాగుదామనుకున్నాను. కానీ, నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు 10 కోట్లు లాభపడుతున్నావు అంటాడు వైరా. 

నీకు డబ్బులు కావాలి. నాకు డబ్బులు కావాలి. ఇద్దరికీ లాభం అయ్యే పని చేశాము కదా అంటుంది జ్యోత్స్న. అయినా ఆ ఆస్తి అంతా నీదే అయినప్పుడు రూ. 10 కోట్ల కోసం కక్కుర్తి ఎందుకు అని అడుగుతాడు వైరా. నీకు డబ్బులు కావాలా? సమాధానం కావాలా? అంటుంది జ్యోత్స్న. నాకు డబ్బులే కావాలి అంటాడు వైరా. అయితే సైలెంట్ గా ఉండు అంటుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories