Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా

Published : Dec 16, 2025, 10:19 AM IST

Regina Cassandra: రెజీనా కసాండ్రా అందరికీ క్రిస్టియన్ అని మాత్రమే తెలుసు. నిజానికి ఆమె ఒక ముస్లిం. ముస్లిం కుటుంబంలో పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో రెజీనా బయట పెట్టింది. 

PREV
15
ముస్లిం కుటుంబంలో జన్మించిన రెజీనా

రెజినా కసాండ్రా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ హీరోయిన్. అలాగని గ్లామర్ పాత్రలకే అంకితం అయిపోకుండా మంచి నటిగా పేరు తెచ్చే పాత్రలను కూడా ఎంపిక చేసుకుంది. చిన్న వయసులోనే యాడ్స్ లో నటిస్తూ కెరియర్ ను ప్రారంభించింది. చదువుతో పాటు మోడలింగ్, యాంకరింగ్ కూడా చేసింది. కెమెరా ముందు ఎలాంటి భయం బెదురు లేకుండా చిన్న వయసులోనే ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈమె 1990 డిసెంబర్ 13న చెన్నైలో పుట్టింది. అందరూ రెజీనా ఒక క్రిస్టియన్ అనుకుంటారు కానీ నిజానికి ఆమె ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది.

25
తల్లీతండ్రి విడిపోవడంతో...

రెజినా కసాండ్రా పేరు వింటే ఆమె క్రిస్టియన్ అని అర్థం అయిపోతుంది. అయితే రెజీనా చెప్పిన ప్రకారం ఆమె తండ్రి ఒక ముస్లిం, తల్లి క్రిస్టియన్. ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. ముస్లిం కావడంతో తనకు కేవలం రెజీనా అని మాత్రమే పేరు పెట్టారు. అయితే ఈమెకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. దీంతో రెజీనా తల్లి వెంట వెళ్లిపోయింది. తల్లి క్రిస్టియన్ కావడంతో బాప్టిజం స్వీకరించింది. ఇక అప్పటినుంచి రెజీనా కసాండ్రాగా మారిపోయింది.

35
మతాలన్నీ సమానమే

సినిమా రంగంలో రెజీనాకి తొలి అవకాశం కన్నడ చిత్ర పరిశ్రమ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి తమిళ్ సినిమాల్లో అలా తెలుగు సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది. తెలుగులో అయితే శివ మనసులో శ్రుతి, రౌడీ ఫెలో, పిల్లా నువ్వు లేని జీవితం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది రెజీనా. ఇక పిల్ల నువ్వు లేని జీవితం సినిమా ఆమెకు లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్ అయినా కూడా రెజీనాకు అన్ని మతాల పట్ల గౌరవం ఎక్కువ. తనకు మతం విషయంలో స్వతంత్ర ఆలోచనలు ఉన్నాయని, అన్నింటినీ సమానంగా చూస్తానని చెప్పుకొచ్చింది. సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది రెజీనా. ఈ చదువే తన జీవితాన్ని అర్థం చేసుకోవడంలో, సినీ పాత్రలను లోతుగా పరిశోధించడంలో ఉపయోగపడిందని రెజీనా చాలా సార్లు చెప్పింది.

45
రెజీనా చాలా ఓపెన్

రెజీనా సినిమాలతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ఎంతో విలువ ఇస్తుంది. అందుకే యోగా, జిమ్ అనేవి ఆమె రోజువారీ జీవితంలో భాగం అయిపోయాయి. మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్ గా మాట్లాడే కొద్దిమంది హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఒత్తిడి, డిప్రెషన్ లాంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అని రెజీనా ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.

55
రెజీనా చాలా యాక్టివ్

సోషల్ మీడియాలో రెజీనా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన ఆలోచనలు, ప్రయాణాలు, ఫిట్నెస్ వంటివి కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఈమె జంతు ప్రేమికురాలు. అవసరమైన చోట తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడంలో ఏమాత్రం ఆలోచించదు. ప్రస్తుతం ప్రజలకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అప్పుడప్పుడు ఒకటో రెండో సినిమాల్లో తప్ప పెద్దగా రెజీనాకు ఇప్పుడు సినీ అవకాశాలు లేవు. ప్రస్తుతం తమిళంలో ఎక్కువ సినిమాలు నటిస్తోంది. అలాగే అన్యాస్ ట్యుటోరియల్, ఫర్జీ వంటి వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది.

Read more Photos on
click me!

Recommended Stories