అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Published : Dec 16, 2025, 09:56 AM IST

Akhanda 2 Box Office Collection : నందమూరి నట సింహం బాలకృష్ణ  సినిమా అఖండ 2 రిలీజై 4 రోజులు పూర్తయింది. తాజా  రిపోర్ట్స్ ప్రకారం, సినిమా వసూళ్లలో ఇప్పుడు భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఈ సినిమా సోమవారం ఎంత వసూలు చేసిందో తెలుసా? 

PREV
16
అఖండ 2 విడుదలయ్యి 4 రోజులు

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా అఖండ 2 రిలీజై 4 రోజులు పూర్తయింది. ఎన్నో అవాంతరాలు దాటుకుని డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది అఖండ 2. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాకపోయినా, మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర భారీగానే వసూలు చేసింది బాలయ్య సినిమా.

26
అఖండ 2 కలెక్షన్లు

అఖండ 2 సినిమా రిలీజై 4 రోజులైంది. మొదటిరోజు బాగానే వసులు చేసిన ఈసినిమా.. రెండో రోజు నుంచి తగ్గుతూ వచ్చింది. sacnilk.com ప్రకారం, ఈ సినిమా నాలుగో రోజు 5.35 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 66.45 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది.

36
భారీగా పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు

అఖండ 2 సినిమా ఓపెనింగ్ రోజున 22.5 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు 15.5 కోట్లు, మూడో రోజు 15.1 కోట్లు వసూళ్లను సాధించింది. మొదటి సోమవారం ఈ సినిమా కలెక్షన్ భారీగా పడిపోయాయి.

46
ప్రపంచవ్యాప్తంగా ఎంత వచ్చాయంటే?

అఖండ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 83 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఈసినిమా  ఓవర్సీస్ కలెక్షన్ 10.60 కోట్లు, ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 72.40 కోట్లు.

56
అఖండ 2 బడ్జెట్ వివరాలు

నందమూరి బాలకృష్ణ అఖండ 2లో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, శాశ్వత ఛటర్జీ, సాంగే షెల్ట్రిమ్, రాన్సన్ విన్సెంట్, విజి చంద్రశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలయ్య అఘోరాగా అదరగొట్టాడు. సిల్వర్ స్క్రీన్ మీద నటసింహం పెర్ఫామెన్స్ చూసిన అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. ఇక ఈసినిమాకు దాదాపు  150 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. 

66
వరుస విజయాలతో జోరుమీదున్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ అఖండ 2, 2021లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 70 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా 150 కోట్ల బిజినెస్ చేసింది.మరి అంతకు మించి అంచనాలతో రిలీజ్ అయిన ఈసినిమా.. ఫైనల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణకు ఈ సినిమా విజయం ఎంతో ముఖ్యం. అఖండ2 హిట్ అయితే… ఆయన ఖాతాలో 5వ హిట్ పడుతుంది.. మరోసినిమాకూడా సక్సెస్ సాధిస్తే.. బలయ్య ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్ పడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories