
రామ్ పోతినేని(Ram Pothineni) రిలీజ్ కు రెడిగా ఉన్న క్రేజీ చిత్రం డబల్ ఇస్మార్ట్(Double Ismart). ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగులో డైనమిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్(Puri Jagannadh) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dut)విలన్గా చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్, సింగిల్ రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే రెండు సాంగ్స్ వదిలితే అవి జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. రెండో పాట వివాదంలోనూ ఇరుక్కుని మంచి పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చారని, ఆయన మార్క్ లెవల్లో డైలాగ్స్ అదిరిపోయి చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బిజినెస్ కూడా అంతే క్రేజీగా అయ్యిపోవటం సహజం.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు హనుమాన్ నిర్మాతలు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు 'డబుల్ ఇస్మార్ట్' .. నార్త్ ఇండియా మినహా వరల్డ్ వైడ్ హక్కులను 54 కోట్లకు థియేటర్ హక్కులు తీసుకున్నారు. ఇది మాసివ్ డీల్. ఆగస్ట్ 15 రిలీజ్ డేట్ ఇవ్వటం బిగ్ హాలీడే వీకెండ్ కావటంతో కలెక్షన్స్ టాక్ తో సంభందం లేకుండా కుమ్మేస్తాయని భావించే అంత రేటు పెట్టి తీసుకున్నారు. అయితే ఈ బిజినెస్ లో చిన్న మెలిక ఉందంటోంది మీడియా.
ఆ మెలిక మరేదో కాదు లైగర్ సెటిల్ మెంట్లు అని తెలుస్తోంది. నైజాంలో, ఉత్తరాంద్ర ముఖ్యంగా వైజాగ్ లో లైగర్ సినిమాను విడుదల చేసిన వారి దగ్గరే థియేటర్లు వున్నాయి. అక్కడ లైగర్ నష్టాలకు సంభందించి సెటిల్మెంట్ చేసుకోకపోతే థియేటర్ల సమస్య తలెత్తే అవకాసం ఉందంటున్నారు. అలాగని లైగర్ సెటిల్మెంట్ సైలెంట్ గా మొదలెడితే అన్ని ఏరియాలు వాళ్లు కదిలి వస్తారు. అంతే కాదు లైగర్ నష్టాలు నిమిత్తం డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతున్న మొత్తం వేరు పూరి, ఛార్మిలు ఇస్తామంటున్న మొత్తం వేరు అని చెప్తున్నారు. ఈ రెండు ఎక్కడో చోట ఓ అంకెకు ఫిక్స్ అవ్వాలి. ప్రస్తుతం మధ్య వర్తులతో ఆ సెటిల్మెంట్ జరుగుతోంది అంటున్నారు.
అలాగని హనుమాన్ నిర్మాతలు ధర్డ్ పార్టీవారు కాబట్టి వారి సినిమాను లీగల్ గా అడ్డు పెట్టడానికి వీలు లేదు. దానికి తోడు ఆగస్ట్ 15 కు అన్ని చోట్లా డబుల్ ఇస్మార్ట్ నడుస్తూంటే తాము థియేటర్స్ ఖాళీగా ఉంచుకోకుండా ఆ షోలు వేయాల్సిందే.లేకపోతే థియోటర్ పరంగా బిజినెస్ కు అడ్డు వస్తుంది. దాంతో ఈ లోగా లైగర్ విషయం అటో ఇటో తేల్చుకుంటే మేలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదైమైనా పూరి తెలిగివా నిరంజన్ రెడ్డికే ఓ రైటుకు ఫైనల్ చేసి సింగిల్ బయ్యర్ గా ఈ చిత్రం రైట్స్ ఇవ్వటం తెలివైన పని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రం నాన్ థియేటర్ రైట్స్ కు కూడా మంచి డిమాండ్ ఉంది. హిందీ శాటిలైట్ రైట్స్, ఓటిటి రైట్స్ నుంచి భారీ మొత్తం రానుంది. ఆ టాక్స్ కూడా జరుగుతున్నాయి. అమేజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్ ఈ రెండింటిలో ఒకదానికి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఇచ్చేసారని తెలుస్తోంది. మంచి లాభానికే పూరి ఈ సినిమా తో బయిటపడనున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఈ సినిమా కన్నా ముందు పూరీ జగన్నాథ్ మరియు రామ్ లు ఇద్దరికీ కూడా ఫ్లాఫ్స్ రావటంతో ఆ ఇంపాక్ట్ డబుల్ ఇస్మార్ట్ పై పడుతుంది అనుకున్నారు. ఈ సారి భారీ బడ్జెట్ తో సీక్వెల్ రూపొందుతుంది అని తెలుస్తోంది…ఆల్ మోస్ట్ సినిమా కోసం ఇప్పుడు 65-70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని వినిపిస్తోందిన, స్టార్ కాస్ట్ కి రెమ్యునరేషన్ ల కింద ఎక్కువ అమౌంట్ వెళ్ళింది అంటున్నారు. అయితే నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి రేటుకి అమ్ముతున్నారు కాబట్టి నో ప్లాబ్లం అంటన్నారు.
‘కేజీఎఫ్’తో అధిరాగా భయపెట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) - రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)తో అలరించబోతున్నారు.
డబుల్ ఇస్మార్ట్ సినిమాతో హిట్ కొట్టాలని పూరి జగన్నాథ్-రామ్ కసిగా ఉన్నారు. ఇంట్రెస్టింగ్‌గా వీరిద్దరి లాస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌యే కావడం విశేషం. రామ్ చివరిగా స్కంద సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. గత ఏడాది రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్‌ను అనుకున్నతంగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు పూరి జగన్నాథ్ చివరిగా లైగర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించారు. విజయ్ దేవరకొండతో చేసిన ఈ సినిమాతో ఫ్లాప్ అయింది.
'పూరి కనెక్ట్స్' బ్యానర్‌పై హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సారి ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. పూరీ ముంబైలో డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ తీశాడని..ఈ సీన్ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెట్టాడని టాక్ వినిపించింది. ఆలీ, షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ శీను తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.