మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌కి కమర్షియాలిటీని పరిచయం చేసిన హీరో. సినిమా అంటే పాటలు, ఫైట్లు, గ్లామర్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని మేళవింపుతో కూడుకున్న అంశాలని తెలియజేసిన హీరో. చిరు హీరోగా ఎదిగాక టాలీవుడ్ లో వచ్చిన సినిమాల పంథానే మారిపోయింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన కారణం అయ్యారని చెప్పొచ్చు.