పవన్ కళ్యాణ్ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనుకుని ఫ్లాప్ అయిన మూవీ ఏదో తెలుసా.. జానీ కాదు

Published : Jul 01, 2024, 06:04 PM IST

దాదాపు పదేళ్లు పవన్ కి హిట్ లేదు. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ భారీ అంచనాలతో విడుదలై చతికిలబడింది. పవన్ చేసిన ప్రయోగానికి ప్రశంసలు దక్కాయి కానీ ఆ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.

PREV
16
పవన్ కళ్యాణ్ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనుకుని ఫ్లాప్ అయిన మూవీ ఏదో తెలుసా.. జానీ కాదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో కెరీర్ మొదలు పెట్టారు. అయిష్టంగానే సినీ ఫీల్డ్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రంతో ఆశించిన ఫలితం రాలేదు. ఆ తర్వాత పవన్ నటించిన చిత్రాలన్నీ వరుసగా బ్లాక్ బస్టర్స్ అవుతూ వచ్చాయి. పవన్ జైత్ర యాత్ర ఖుషి వరకు కొనసాగింది. 

26

ఖుషి చిత్రంతో పవన్ సౌత్ లో టాప్ హీరోల్లో ఒకరిగా మారిపోయారు. నేను కూడా ఇక జాగ్రత్త పడాలి అని చిరంజీవి అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. టాప్ కార్పొరేట్ బ్రాండ్స్ కూడా పవన్ కి అత్యధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేశాయి. కానీ ఖుషి తర్వాత ఏదో మాయ జరిగినట్లు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. 

36

దాదాపు పదేళ్లు పవన్ కి హిట్ లేదు. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ భారీ అంచనాలతో విడుదలై చతికిలబడింది. పవన్ చేసిన ప్రయోగానికి ప్రశంసలు దక్కాయి కానీ ఆ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. చాలా నిరాశపరిచింది. ఆ చిత్రంతో నష్టాలు మిగిలాయి. 

46
Pawan Kalyan

ఆ తర్వాత ప్రయోగాలు చేయకుండా వినోదం ఉండేలా గుండుభా శంకర్ చిత్రం చేశారు. వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన చిత్రం బాలు. తనకి తొలిప్రేమ లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన కరుణాకరన్ దర్శకత్వంలో బాలు చిత్రం మొదలయింది. రిలీజ్ కి ముందే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. 

56

ఇందులో ఇంటెన్స్ గా ఉండే స్టోరీ కూడా ఉంటుంది. ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని పవన్ కళ్యాణ్ నమ్మారు. బహుశా అది డైరెక్టర్ కరుణాకరన్ పై నమ్మకం ఏమో. తొలి రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చింది. ఫస్ట్ డే రిలీజ్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ బాలు సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట. 

66

అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది అంటూ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత బాలు చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా స్లో అయిపోయింది. పవన్ కళ్యాణ్ కి మరో ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమాల రిజల్ట్ గురించి పట్టించుకోవడం మానేశారు. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. చివరికి గబ్బర్ సింగ్ చిత్రంతో కోరుకున్న హిట్ దక్కింది. 

Read more Photos on
click me!

Recommended Stories