మంచువారి కుటుంబంలో కుంపటి, కత్తులు దూసుకుంటున్న మోహన్ బాబు-మనోజ్, షాకింగ్ డిటైల్స్ 

Published : Dec 10, 2024, 02:22 PM IST

ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం కలిగిన మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన సంక్షోభం పరిశ్రమను ఊపేస్తోంది. మోహన్ బాబు - మనోజ్ పరస్పర భౌతిక దాడులు చేసుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. అసలు ఈ గొడవలకు మూలం ఏమిటీ? తండ్రీకొడుకులు ఎందుకు కత్తులు దూసుకుంటున్నారు? డిటైల్డ్ స్టోరీ..

PREV
17
మంచువారి కుటుంబంలో కుంపటి, కత్తులు దూసుకుంటున్న మోహన్ బాబు-మనోజ్, షాకింగ్ డిటైల్స్ 
రెండో భార్య కొడుకు

మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి అకాల మరణం చెందారు. వీరి సంతానమే మంచు లక్ష్మి, విష్ణు. భార్య దూరమయ్యాక మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నాడు. విద్యాదేవి సొంత చెల్లెలు నిర్మలాదేవితో వివాహమైంది. రెండో భార్య నిర్మలాదేవికి మనోజ్ పుట్టాడు. ముగ్గురు పిల్లలను మోహన్ బాబు ప్రేమగా పెంచారు. సమాన అవకాశాలు కల్పించారు అయితే విష్ణు పట్ల మోహన్ బాబు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నారు. ఆరంభం నుండి విష్ణుకు కొంత ఫేవర్ చేశారనే టాక్ ఉంది. 
 

27
విష్ణు-మనోజ్ హీరోలుగా ఎంట్రీ

 

మోహన్ బాబు తన ఇద్దరు కుమారులను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. పెద్దబ్బాయి విష్ణు 2003లో 'విష్ణు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విష్ణు మొదటి చిత్రాన్ని మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విష్ణు మూవీ బడ్జెట్ రూ. 30 కోట్లు అని సమాచారం. 20 ఏళ్ల క్రితం అంత బడ్జెట్ అంటే.. ఈ రోజుల్లో 200 కోట్ల సినిమాతో సమానం. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ నష్టాలు మిగిల్చింది. 

అదే సమయంలో మనోజ్ సాదాసీదాగా పరిచయం అయ్యాడు. రీమేక్ దొంగ దొంగది మనోజ్ డెబ్యూ మూవీ. మనోజ్ కి జంటగా సదా నటించింది. 2004లో విడుదలైన దొంగ దొంగది పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఒరిజినల్ తమిళ్ లో త్రిష, ధనుష్ నటించారు.  
 

37
మనోజ్ కి మొండి చేయి

హీరోలుగా మనోజ్, విష్ణు సక్సెస్ కాలేదు. కనీస మార్కెట్ ఏర్పడలేదు. ఇతర ప్రొడ్యూసర్స్ మంచు హీరోలతో సినిమాలు చేయడం లేదు. ఈ క్రమంలో మోహన్ బాబు ఆ బాధ్యత తీసుకున్నారు. ఇద్దరు కొడుకులతో సినిమాలు సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మనోజ్ అహం బ్రహ్మస్మి టైటిల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాడు. మోహన్ బాబు మద్దతు ఇవ్వలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఆరేళ్ళు దాటిపోయింది. 

అదే సమయంలో విష్ణుతో మోహన్ బాబు వరుసగా చిత్రాలు చేస్తున్నారు. మోసగాళ్లు టైటిల్ తో చేసిన క్రైమ్ డ్రామా భారీ బడ్జెట్ మూవీ. ఈ చిత్రానికి కనీస ఆదరణ దక్కలేదు. కోట్లలో నష్టాలు వచ్చాయి. 2022లో జిన్నా టైటిల్ తో మరొక చిత్రం చేశారు. ఆ మూవీ  కోటి రూపాయల వసూళ్లు రాబట్టలేదు. అయినప్పటికీ విష్ణుతో మోహన్ బాబు సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. 

మనోజ్ అహం బ్రహ్మస్మి మూవీకి సహకారం అందించని మోహన్ బాబు... విష్ణుతో కన్నప్ప మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 100 కోట్లు. ఈ పరిణామం మనోజ్ లో అసహనానికి కారణం కావచ్చు. 
 

47
భూమా మౌనికతో పెళ్లి

భూమా మౌనికతో ప్రేమ, పెళ్లి వ్యవహారం కూడా మోహన్ బాబు-మనోజ్ మధ్య విబేధాలకు కారణం అనే వాదన ఉంది. మౌనికను మోహన్ బాబు కోడలిగా అంగీకరించలేదు. పెళ్ళికి ససేమిరా అన్నాడు. తండ్రి మాటను లెక్క చేయకుండా మౌనికతో మనోజ్ ఏడడుగులు వేశాడు. ఈ పెళ్ళికి మోహన్ బాబు, విష్ణు మొక్కుబడిగా హాజరయ్యారు. విష్ణు అలా కనిపించి వెళ్ళిపోయాడు. మోహన్ బాబు చివరి నిమిషంలో వచ్చి వధూవరులను ఆశీర్వదించాడు. 

మోహన్ బాబు, విష్ణులతో మంచు లక్ష్మికి కూడా చెడింది. మనోజ్ వైపు ఉన్న లక్ష్మి... పెళ్లి బాధ్యత తీసుకుంది. మౌనిక-మనోజ్ ల వివాహం ఆమె నివాసంలో జరిగింది. 

57
విష్ణుకు పెత్తనం

 

మోహన్ బాబు తన ముగ్గురు సంతానంలో విష్ణు సమర్ధుడు అని నమ్ముతాడు. కీలక బాధ్యతలు విష్ణు చేతిలో పెట్టాడు. మంచు కుటుంబానికి తిరుపతిలో గల శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రధాన ఆదాయ వనరు. ఈ సంస్థ బాధ్యతలు పూర్తిగా విష్ణుకు అప్పగించాడు.మనోజ్, లక్ష్మిలకు ఎలాంటి ప్రమేయం లేకుండా పోయింది. ఇది మనోజ్ కి నచ్చడం లేదు. 

67
ఆస్తుల పంపకాలు

 

గత ఐదేళ్లుగా మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదాలు నెలకొన్నాయని సమాచారం. మోహన్ బాబు ముగ్గురు పిల్లలకు ఆస్తులు పంచారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చాడు. శ్రీవిద్యా నికేతన్ మాత్రం మోహన్ బాబు, విష్ణు పరిధిలో ఉంది. తన పేరిట కొన్ని ఆస్తులు ఉంచుకున్న మోహన్ బాబు.. కొంత మేర వారసులకు భాగాలుగా పంచారు. ఆస్తుల పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందనే భావన మనోజ్, మంచు లక్ష్మిలలో ఉంది. 

అలాగే ఉమ్మడి ఆస్తి ద్వారా వస్తున్న ఆదాయాన్ని విష్ణు సినిమాలకు పెట్టుబడిగా పెడుతున్నారు. తమకు ఒక్క రూపాయి ప్రయోజనం చేయడం లేదనేది మనోజ్ ఆవేదన అట. 

77
ఫార్మ్ హౌస్ పై మనోజ్ కన్ను

 

మోహన్ బాబు తన శేష జీవితం ప్రశాంతంగా గడపాలని శంషాబాద్ సమీపంలో గల జుల్పల్లి లో ఒక ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఫార్మ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆస్తి ఆయన పేరిట ఉంది. పిల్లలకు పంచలేదు. మనోజ్ తనకు ఆ ఫార్మ్ హౌస్ కావాలని అడుగుతున్నాడట. ఈ ఆస్తి కోసమే సెటిల్మెంట్స్ చోటు చేసుకున్నాయట. 

ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు దిగడం, కేసు పెట్టుకోవడానికి జుల్పల్లి ఫార్మ్ హౌస్ కారణం అట. మోహన్ బాబు ఈ ఆస్తిని మనోజ్ కి ఇచ్చేది లేదని నిశ్చయించుకున్నాడట. ఈ ఫార్మ్ హౌస్ మార్కెట్ విలువ వందల కోట్లలో ఉండే అవకాశం కలదట. మొత్తంగా ఈ పరిణామాలు మంచు వారి కొంపలో కుంపటి పెట్టాయి..  

click me!

Recommended Stories