అనసూయ వ్యక్తిగత జీవితంలో అనేక మలుపులు, ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమె ప్రేమ యుద్ధం చేసింది. ఏళ్ల తరబడి వేచి చూసి కోరుకున్నవాడితో ఏడడుగులు వేసింది. ఎన్ సీ సీ క్యాడెట్ అయిన అనసూయ.. ఓ క్యాంపులో సుశాంక్ భరద్వాజ్ ని కలిసింది. అప్పటికి వారు స్కూలింగ్ చేస్తున్నారట. స్కూల్ డేస్ లో మొదలైన వారి బంధం.. పెళ్లి వరకు వచ్చింది.