మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా నుంచి క్రేజీ లీక్‌.. మరో `బాహుబలి` తీస్తున్నాడా? ఫ్యాన్స్ సెటైర్లు

Published : Dec 10, 2024, 01:34 PM IST

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి సంబంధించిన క్రేజీ లీక్‌ బయటకు వచ్చింది. జక్కన్న `బాహుబలి` స్టయిల్‌ని ఫాలో అవుతున్నారట.   

PREV
14
మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా నుంచి క్రేజీ లీక్‌.. మరో `బాహుబలి` తీస్తున్నాడా? ఫ్యాన్స్ సెటైర్లు

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా(ఎస్‌ఎస్‌ఎంబీ29) కోసం అభిమానులంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. సినిమా గురించి విజయేంద్రప్రసాద్‌, రాజమౌళి అడపాదడపా అప్‌ డేట్లు ఇస్తున్నారు తప్ప, సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే క్లారిటీ లేదు. సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తితో ఉన్నారు మహేష్‌ అభిమానులు. రాజమౌళి దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది తెలియాల్సి ఉంది. విజయేంద్రప్రసాద్‌ లీకేజీ ప్రకారం సినిమా జనవరిలో స్టార్ట్ కానుందని సమాచారం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం క్లిక్‌ చేయండి.

24

మహేష్‌ బాబు తో చేయబోతున్న సినిమాని గ్లోబల్‌ మూవీ రేంజ్‌లో తెరకెక్కించబోతున్నట్టు రాజమౌళి తెలిపారు. భారీ స్కేల్‌లో ఉంటుందన్నారు. ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనిచేస్తారని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది.

ఈ మూవీ విషయంలోనూ రాజమౌళి `బాహుబలి` పంథాని ఫాలో కాబోతున్నాడని తెలుస్తుంది. మహేష్‌ సినిమాని కూడా రెండు భాగాలుగా తీసే ఆలోచనలో ఉన్నారట. తాజాగా ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 

34

వెయ్యి కోట్లతో ఈ మూవీని నిర్మించబోతున్నారని తెలుస్తుంది. అయితే బడ్జెట్‌ బాగా పెరిగే అవకాశం ఉందట. ఈ లెక్కన 1200కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదట. అందుకే ఈ మూవీని రెండు పార్ట్ లుగా తీయాలని రాజమౌళి భావిస్తున్నారట. అంతేకాదు ఈ మూవీ కంప్లీట్ కావడానికి దాదాపు 6-8ఏళ్లు పట్టే అవకాశం ఉందని సమాచారం. అంటే ఈ ఆరేడు ఏళ్లలో చాలా లెక్కలు మారిపోతాయి. మళ్లీ ఇంత కాలం వెయిట్‌ చేయాలా అని నెటిజన్లు ఆవేదన చెందుతున్నారు. కొందరు సెటైర్లు పేల్చుతున్నారు. 
 

44
Mahesh Babu and Rajamouli

ఆ లోపు మాకు పెళ్లిళ్లు అయి పిల్లలు పుడతారని కొందరు, పెళ్లిళ్లు అయిన వాళ్లు పిల్లలు పెద్దగైపోతారని, అదిగోరా మహేష్ తాతని చూడండి అని చెబుతామని అంటున్నారు. ఫన్నీ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. మరి నిజంగానే దీన్ని రెండు పార్ట్ లు చేస్తారా? ఏం చేయబోతున్నారనేది చూడాలి. 

read more: చిరంజీవి ప్రాణం పెట్టి చేసిన మూవీ, ఆరేళ్ల కష్టం, మూడురెట్ల బడ్జెట్‌.. కట్‌ చేస్తే ఫ్యూజులు ఎగిరిపోయే రిజల్ట్

also read: మోహన్ బాబు కుటుంబ వివాదం: మంచు మనోజ్ సంచలన ఆరోపణలు, పవన్‌, చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలకు లేఖ
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories