బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ ఎలిమినేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టాప్ 2 లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఎందుకు ఎలిమినేటి అయ్యాడు ? అతడు చేసిన తప్పుల వల్లా లేక బిగ్ బాస్ ప్లానింగా అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చాలా మంది రోహిత్ నాయుడు టాప్ 5 లో ఉంటాడని నమ్మారు. మరికొందరు అయితే అతడు టాప్ 2 లో ఉండే కంటెస్టెంట్.. విన్నర్ లేదా రన్నర్ స్థానానికి అర్హుడు అని ముందు నుంచి చెబుతూ వచ్చారు. కానీ రోహిత్ హౌస్ లో 60 రోజులు కూడా ఉండలేకపోయాడు. ఆదివారం రోజు రోహిత్ హౌస్ మేట్స్ ఓటింగ్ కారణంగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
25
చిన్నదానికి పెద్ద హంగామా
అయితే రోహిత్ ఇంత సడెన్ గా ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు అతడు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతుంటే మరికొందరు ఇదంతా బిగ్ బాస్ స్కెచ్ అని అంటున్నారు. రోహిత్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ డే నుంచి అగ్రసివ్ గానే ఉంటున్నాడు. రోహిత్ కి బాగా క్లోజ్ అయిన షాలిని కూడా అందరి పట్ల అగ్రసివ్ గానే ఉండడం చూశాం. చిన్న విషయాలకు కూడా వీరిద్దరి నుంచి పెద్ద రియాక్షన్ వచ్చేది.. అనవసరమైన సెటైర్లు, కాస్త అలోచించి మాట్లాడలేకపోవడం.. మైండ్ లో ఏది అనిపిస్తే అది కక్కేయడం ఇద్దరికీ అలవాటుగా మారింది.
35
సామాన్యులకు దూరం
ఆ యాటిట్యూడ్ చాలా మందికి నచ్చలేదు. హౌస్ లో పనుల గురించి ప్రస్తవన వచ్చినప్పుడు రోహిత్.. నేను చేయను, అలవాటు లేదు అన్నట్లుగా బిహేవియర్ చూపించాడు. అగ్ని పరీక్ష ద్వారా కామనర్ గా వచ్చిన రోహిత్ కి ఇలాంటి ప్రవర్తన వల్ల సామాన్యులతో డిస్ కనెక్ట్ అయ్యాడు. షాలినితో క్లోజ్ నెస్ కూడా రోహిత్ కి మైనస్ అయింది. ఈ కారణాల వల్లే రోహిత్ ఎలిమినేట్ అయ్యాడా అంటే.. చెప్పడం కష్టం.
నాగార్జున వీకెండ్ వచ్చిన ప్రతిసారి కాన్స్టెంట్ గా రోహిత్, షాలిని లకు క్లాస్ పీకుతూ వచ్చాడు. అగ్రేసింగ్ గా ఉండే వీళ్లిద్దరికీ నాగార్జున తన అగ్రెసివ్ అప్రోచ్ చూపించాడు. త్రిగున్ కూడా అగ్రెసివ్ అందులో అనుమానం లేదు. కానీ త్రిగుణ్ ఆడియన్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. తప్పు చేసినప్పుడు సరిదిద్దుకునే తత్త్వం త్రిగుణ్ లో కనిపించింది. నాగార్జున ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఆ టైంకి సారీ చెప్పి తర్వాత అదే పద్దతిని రోహిత్, షాలిని కొనసాగించారు. నాగార్జున వార్నింగ్ ఇచ్చినప్పుడు రోహిత్.. బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశాడు. నన్నే ఎందుకు తప్పుగా చూపిస్తున్నారు.. అసలు ఫుటేజ్ మొత్తం ఏమవుతోంది ? అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టాడు.
55
ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి
ఎప్పుడైతే నాగార్జున రోహిత్ కి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారో అప్పుడు రోహిత్ పరిస్థితి చేజారిపోయింది. దీనికి తోడు రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్ లని ప్రవేశపెట్టి రోహిత్ ని రెడ్ జోన్ లో పడేశారు. ఆ తర్వాత డబుల్ ఎలిమినేషన్ పేరుతో హౌస్ మేట్స్ ఓటింగ్ పెట్టి రోహిత్ ని సాగనంపారు. మొత్తంగా రోహిత్ ఎలిమినేషన్ లో అతడు చేసిన తప్పులతో పాటు బిగ్ బాస్ ప్లానింగ్ కూడా ఉందనేది నెటిజన్ల అభిప్రాయం.