విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం `ఆదర్శ కుటుంబం ఏకే 47`. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నివేతా పేతురాజ్, రావు రమేష్, బ్రహ్మాజీ, సత్య వంటి వారు కీలక పాత్రలు పోషించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదలైంది. ఇది ఫన్, ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. మొదటిసారి త్రివిక్రమ్ రూట్ మార్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ వేరే లెవల్ లో ఉంటుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో కొంత మిక్స్ డ్ రియాక్షన్ కూడా వినిపించింది. బాక్సాఫీసు వద్ద డీసెంట్‌గా రన్ అవుతుంది.