జబర్దస్త్ లో నవ్వించే ఫైమా నిజ జీవితంలో కష్టాలు, బీడీలు చుట్టి అమ్మ పెంచిందన్న కమెడియన్

Published : Jun 22, 2022, 12:51 PM IST

తెరమీద నవ్వించే కమెడియన్స్ చాలా మంది.. తెరవెనుక కన్నీటి కష్టాలు ఉంటాయి. నవ్వుల వెనుకు కష్టాల కడగళ్శు ఉంటాయి. అలాంటి కష్టాల గురించి వివరించింది జబర్థస్థ్ కమెడియర్ ఫైమా. 

PREV
18
జబర్దస్త్ లో నవ్వించే ఫైమా నిజ జీవితంలో కష్టాలు, బీడీలు చుట్టి అమ్మ  పెంచిందన్న కమెడియన్

జబర్దస్త్ కామెడీ షోలో టైమింగ్ తో కామెడీ చేస్తూ... ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. లేడీ కమెడియన్ పైమా. ఫైమా తెరపై కనిపిస్తే చాలు నవ్వు పంట పండుతుంది. వరుసగా ప్రవాహంలా ఫైమా వేసే పంచులకు కడుపు పట్టుకుని నవ్వాల్సిందే.. అటువంటి నవ్వుల రేడు ఫైమా వెనకు కష్టాల కడగళ్ళు కూడా ఉన్నాయి. 
 

28

పటాస్ షో తో బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది ఫైమా.. ఎక్స్ ట్రా  జబర్దస్త్ షో తో ఆడియన్స్ కు ఎంతో  దగ్గర అయ్యింది. జబర్దస్త్ లోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

38

బుల్లెట్ భాస్కర్, ఇమ్మాన్యుయెల్ చేసే కామెడీ స్కిట్ లో ఫైమ్ తన మార్క్  కామెడీ  పంచులతో.. కడుబుబ్బా నవ్విస్తుందిఫైమా.   చాలా తక్కువ సమయంలోనే జబర్దస్త్ లో మంచి పాపులారిటీ పొందిన లేడీ కమెడియన్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకుంది.అయితే ఈవిడ అసలు ప్రయాణం వెనక వేరే లక్ష్యం ఉందట. 

48

పైమా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో, జబర్దస్త్ షో ద్వారా తన ప్రయాణం ఎలా మొదలయింది అనే విషయాలపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వివరంగా  తన అభిప్రాయాలను వెల్లడించింది. తను ఇంతలా నవ్విస్తున్నా.. గతంలో ఎంతగా బాధలు పడింది.. ఎన్ని కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చిందో వివరంగా చెప్పింది ఫైమా. 

58

తమ తల్లి బీడీలు చుట్టి తమను పెంచిందని, అమ్మ కు వచ్చిన ఆ కొంచం డబ్బుతోనే తమకు ఏం కావాల్సిన కొని ఇచ్చేది అని చెప్పుకొచ్చింది. తన బిడ్డలు మంచి పేరు సంపాదించాలని మా అమ్మ ఎప్పుడూ కోరుకుంటూ ఉండేది అని చెప్పింది. మేము నలుగురు అక్కాచెల్లెళ్లం.  మాలో ముగ్గురికి చిన్నవయసులోనే పెళ్లిళ్లు కూడా అయిపోయాయి అని అన్నారు ఫైమా. 
 

68

అమ్మ ఎప్పుడు మంచి పేరు తెచ్చుకుని మెలగాలని చెబుతూ ఉండేది. అప్పుడు ఆవిడ మాటలు నాకు అర్థమయ్యేవి కాదు. తర్వాత మల్లెమాల ద్వారా నేను మంచి పేరు సంపాదించుకున్నాను. అప్పుడప్పుడు మాటల్లో ఆంతర్యం ఏమిటో నాకు అర్థం అయ్యింది. అమ్మ కల నెరవేరింది అని తెలిసింది.
 

78

జబర్దస్త్ లో రాకముందు నాకు పెద్దగా ఆశలు ఉండేవి కాదు. చదువులో కూడా వెనకబడి ఉండేదాన్ని. అప్పటిలో టైలరింగ్ చేస్తూ.. బ్రతుకుదామనుకున్నాను. సాధారణ జీవన సాగించాలని నిర్ణయించుకున్నాను . నా అదృష్టం కొద్ది జబర్దస్త్ లో  అవకాశం వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. మా చిన్న వయసులో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంటి వాళ్ళు వెళ్లిపోమంటే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవలసి వచ్చేది. సరైన సదుపాయాలు కూడా ఉండేవి కాదు. అలానే సర్దుకు పోయేవాళ్ళం.

88

అమ్మ పని చేసుకుంటూ ప్రతి ఇల్లు మారుతూ ఉండేది. అమ్మ పడుతున్న ఈ కష్టాలు చూసేవాళ్ళం కాబట్టి అమ్మకు ఇల్లు కట్టి ఇవ్వాలని.. నలుగురు అక్క చెల్లెలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు నాకు ఉండే ధ్యేయం.. అమ్మకు ఇల్లు కట్టి ఇవ్వడం  అని ఇంటర్వ్యూలో ఫైమా వెల్లడించారు.
 

click me!

Recommended Stories