ప్రియమణి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. నటన, అభినయం, అందం విషయంలో ప్రియమణికి వంకలు పెట్టలేం. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు.