
కమల్ హాసన్ సినీ వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శృతి హాసన్ – అక్షర హాసన్. అక్క శృతి హాసన్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తెలుగులో రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాన్ తో ఆడి పాడింది. రీసెంట్ గా సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్యలతో కూడా నటించి మెప్పించింది శృతి హాసన్. ఇక తన చెల్లెలు అక్షర హాసన్ కూడా బాలీవుడ్ హీరోయిన్ గా, సహాయ దర్శకుడు రాలిగా మంచి సక్సెస్ అందుకుంది.
హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నటైమ్ లోనే కెరీర్ ను కరాబు చేసుకుంది హీరోయిన్ ఆర్తి అగర్వాల్. టాలీవుడ్ లో ప్రభాస్, తరుణ్, ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో నటించిన ఆర్తి అగర్వాల్ అనారోగ్యం కారణంగా చాలా చిన్నవయస్సులో మరణించింది. ఇక ఆమె చెల్లెలు అతిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా రాణించింది. అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆర్తి అగర్వాల్ అంత స్టార్డమ్ ను సాధించలేకపోయింది. ఒకటి రెండు సినిమాలకే ఆమె కనుమరుగైపోయింది.
ఒకే ఫ్యామిలీ నుంచి హీరోయిన్లుగా పరిచయం అయిన వారిలో కాజల్ అగర్వాల్ నిషా అగర్వాల్ టాలీవుడ్ లో ముందున్నారు. స్టార్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్, పవన్ , చిరు, బాలయ్య లాంటి స్టార్స్ సరసన నటించింది. ప్రస్తుతం పెళ్లి పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా ఉంది కాజల్. అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. ఇక ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. కానీ అక్క కాజల్ కంటే ముందే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్లిపోయింది.
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సరసన ఎక్కువ సినిమాలు చేసిన అక్కచెలెళ్లు నగ్మా - జ్యోతిక. దాదాపు నగ్మ స్క్రీన్ కు దూరం అవుతున్న టైమ్ లో జ్యోతిక ఎంట్రీ ఇచ్చింది. నగ్మ నటించిన హీరోలందరితో దాదాపుగా జ్యోతిక కూడా నటించి మెప్పించింది. కోలీవుడ్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లాడిన జ్యోతిక, ప్రస్తుతం విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది, నిర్మాతగా కూడా రానిస్తోంది. ఇక నగ్మ స్క్రీన్ కు దూరం అయ్యి పాలిటిక్స్ లో బిజీ అయిపోయింది.
చైల్డ్ ఆర్టిస్ట్ లు గా తెలుగు , తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు షాలిని – షామిలి జగదేకవీరుడు అతిలోకసుందరి లో కూడా ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు సందడి చేశారు. ఆతరువాత హీరోయిన్లు గా కూడా రాణించారు. షాలిని తమిళంలో ఎక్కుగా హీరోయిన్ రోల్స్ చేసింది. తన కో ఆర్టిస్ట్, తమిళ స్టార్ హీరో అజిత్ ను పెళ్ళాడి ప్యామిలీ లైఫ్ కే పరిమితం అయ్యింది షాలిని. ఇక బేబీ షామిలీ కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో ఓయ్ మూవీతో ఆకట్టుకుంది ఈ హీరోయిన్.. ఆతరువాత తెరమరుగైపోయింది.
కన్నడ నుంచి ఇండస్ట్రీలో మెరిసిన హీరోయిన్లు సంజనా గల్రానీ – నిక్కీ గల్రానీ. ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమా తో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్ సంజన. ప్రస్తుతం సంజన తెలుగు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తోంది. ఇక తన చెల్లెలు నిక్కీ గల్రానీ కూడా తెలుగులో, తమిళంలో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు హీరో ఆది పినిశెట్టిని ప్రేమించి పెళ్ళాడింది నిక్కీ. ప్రస్తుతం సినిమాలకు ఆమె దూరంగా ఉంటోంది.
టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక. సౌత్ లో అన్ని భాషల్లో స్టార్ హీరోలతో ఆమె నటించి మెప్పించింది. ఎఎన్నార్, శోభన్ బాబు నుంచి చిరంజీవి, బాలయ్య వరకూ ఎంతో మంది స్టార్స్ తో నటించి మెప్పించింది రాధిక. ఇక ఆమె చెల్లెలు నిరోషా కూడా తెలుగు, తమిళ బాషల్లో హీరోయిన్ గా నటించింది. కానీ రాధిక చేసినన్ని సినిమాలు ఆమె చేయలేదు. కొంత కాలానికి నిరోష తెరమరుగు అయ్యింది. ప్రస్తుతం రాధిక క్యారెక్టర్ రోల్స్ తో బిజీగా ఉంది.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా భానుప్రియ తెలియనివారు ఉండరు. కానీ ఆమె చెల్లెలు శాంతి ప్రియ కూడా హీరోయిన్ అనీ మీకు తెలుసా? అవును తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్, శోభన్ బాబు లాంటి హీరోలతో నటించిన భాను ప్రియా.. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తోంది. ఆమె చెల్లెలు శాంతి ప్రియ కూడా తెలుగులో హీరోయిన్ గా రాణించింది. నాగార్జునతో అగ్ని సినిమాలో హీరోయిన్ గా నటించిన శాంతి ప్రియా.. ఆతరువాత పెళ్లి చేసుకుని ముంబయ్ లో సెటిల్ అయ్యింది. ఇలా చాలామంది అక్కచెల్లెళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు గారాణించారు.