అల్లు అర్జున్ కాదు, టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో ఎవరో తెలుసా? షాక్ అవుతారు

Published : Oct 15, 2025, 09:59 AM IST

టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో ఎవరు అంటే.. వెంటనే అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది. కానీ బన్నీకంటే ముందే ఓ తెలుగు హీరో సిక్స్ ప్యాక్ చేశాడని మీకు తెలుసా? ఆ హీరో ఎవరో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు?

PREV
15
సిక్స్ ప్యాక్ కేరాఫ్ బాలీవుడ్

ఒకప్పుడు సిక్స్ ప్యాక్ అంటే బాలీవుడ్ హీరోలకు మాత్రమే సాధ్యం అన్నపేరు ఉండేది. ఇండియన్ సినిమాపై బాలీవుడ్ పెత్తనం చేసే కాలంలో, సౌత్ సినిమాలను, సౌత్ యాక్టర్స్ ను చాలా చులకనగా చూసేవారు. సౌత్ సినిమా మొత్తాన్ని అరవ సినిమాల జాబితాలో వేసేవారు. మన కథలను ఇండ్లీ సాంబార్ సినిమాలకింద హేళనచేసిన వారు కూడా ఉన్నారు. అంతే కాదు బాలీవుడ్ హీరోల మాదిరిగా సౌత్ హీరోలు సిక్స్ ప్యాక్ చేయలేరు అని విమర్శలు చేసినవారు చాలామంది ఉన్నారు. బాలీవుడ్ లో జాన్ అబ్రహం, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ లాంటి స్టార్స్ సిక్స్ ప్యాక్ లతో సందడి చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై సౌత్ హవా నడుస్తోంది. టాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో సత్తా చాటుతున్నాయి.

25
అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్

బాలీవుడ్ నుంచి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి జరిగిన అవమానం మన హీరోలలో పట్టుదల పెంచింది. 20 ఏళ్ల క్రితం ఓ హీరోయిన్ చేసిన ఛాలెంజ్ ను ప్రెస్టేజియస్ గా తీసుకున్నాడు అల్లు అర్జున్. సౌత్ హీరోలు సిక్స్ ప్యాక్ చేయలేరు.,బాలీవుడ్ హీరోల మాదిరి బాడీ బిల్డ్ చేయలేరు అని కామెంట్ చేసిందట ఆ హిందీ హీరోయిన్. దాంతో పట్టుదలతో ప్రయత్నం మొదలు పెట్టి..దేశముదురు సినిమా టైమ్ కు సిక్స్ ప్యాక్ చేసి చూపించాడు అల్లు అర్జున్. ఈ విషయాన్ని గతంలలో జరిగిన వేవ్స్ ఈవెంట్ లో వెల్లడించాడు ఐకాన్ స్టార్. ఓ హీరోయిన్ రెచ్చగొట్టడం వల్లే తాను సిక్స్ ప్యాక్ చేసి చూపించానని ఐకాన్ స్టార్ అన్నారు. 20 ఏళ్ల క్రితం సౌత్ లో ఏ నటుడు చేయని సాహసం తాను చేశానని గుర్తు చేశారు. ఇక దేశముదురు ట్రెండ్ మామూలుగా వర్కౌట్ అవ్వలేదు.. ఆ దెబ్బతో పరువుపోతుందని.. సౌత్ హీరోలంతా సిక్స్ ప్యాక్ ల వెనకాల పడ్డారు. ఇక ఇప్పుడు 60 ఏళ్లు దాటిన హీరోలు కూడా సిక్స్ ప్యాక్ చేస్తున్నారు.

35
టాలీవుడ్ ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో ఎవరు?

ఈ జనరేషన్ హీరోలలో టాలీవుడ్ నుంచి ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో అల్లు అర్జున్. కానీ టాలీవుడ్ నుంచి ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో మాత్రం బన్నీ కాదు. 40 ఏళ్ల క్రితమే ఓ తెలుగు హీరో సిక్స్ ప్యాక్ చూపించాడు, కానీ అప్పుడు అది ఎవరు గుర్తించలేకపోయారు. ఆ హీరో ఎవరో కాదు రియల్ స్టార్ శ్రీహరి. విలన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, హీరోగా మారిన శ్రీహరి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కూడా ఇండస్ట్రీలో రాణించారు. ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న ఆయన గతంలో ఓ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించారు. పల్లెటూరి వ్యక్తి పాత్రలో, పంచె కట్టుకుని సిక్స్ ప్యాక్ తో శ్రీహరి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

45
మల్టీ టాలెంటెడ్ స్టార్

విలన్ పాత్ర చేసినా, హీరో పాత్ర చేసినా శ్రీహరి ఫిట్ నెస్ పర్ఫెక్ట్ గా మెయింటేన్ చేసేవారు. మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం కలిగి ఉన్న శ్రీహరి భద్రాచంలం,సూరీడు లాంటి సినిమాల్లో తన పవర్ పంచ్ ఏంటో చూపించాడు. చాలా సినిమాల్లో దర్శకులు శ్రీహరి ఫిట్ నెస్ ను చూపించే ప్రయత్నం చేసేవారు. విలన్ పాత్రలు చేసే టైమ్ లో కూడా శ్రీహరి వర్కౌట్ వీడియోస్ తో స్పెషల్ ఎలివేషన్ సీన్స్ కూడా చూపించిన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా హలో బ్రదర్, ప్రేమంటే ఇదేరా లాంటి సినిమాల్లో శ్రీహరి ఫిట్ నెస్ హీరోలను మించి కనిపిస్తుంది. టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరోగా శ్రీహరి పేరు అఫీషియల్ గా వినిపించకపోయినా.. వైరల్ అవుతున్న శ్రీహరి ఫోటో చూస్తే మాత్రం ఆయనే ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో అని అందరికి అర్ధం అవుతోంది.

55
సిక్స్ ప్యాక్ లెక్కలు మారిపోయాయి

ప్రస్తుతం సిక్స్ ప్యాక్ కామన్ అయిపోయింది. ఒకప్పుడు జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లు రేర్ గా ఉండేవి. హీరోలు మాత్రమే ఎక్కువగా ఖర్చు పెట్టి, ఫారెన్ ట్రైనర్స్ సలహాలతో సిక్స్ ప్యాక్ లు చేసేవారు. కానీ ఇప్పుడు గల్లీ గల్లీకి జిమ్ ఉంది, ఫిట్ నెస్ ట్రైనర్స్ కూడా వేలల్లో పుట్టుకొస్తున్నారు. సాధారణ జనాలు కూడా సిక్స్ ప్యాక్ లు, 8 ప్యాక్ లు చేస్తున్నారు. దాంతో హీరోల సిక్స్ ప్యాక్ లపై ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ పోయింది. ప్రస్తుతం సిక్స్ ప్యాక్ పై ఎటువంటి క్రేజ్ లేదు. కానీ పాన్ ఇండియా సినిమాల మోజు మాత్రం ప్రేక్షకులలో పెరిగిపోయింది. టాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories