`మా` ఎన్నికల హీట్‌ని పీక్‌లోకి తీసుకెళ్తున్న సోనూసూద్‌.. ప్రకాష్‌రాజ్‌తో ఢీ కొట్టబోయేది ఈ రియల్‌ హీరోనేనా?

Published : Jul 09, 2021, 09:25 PM IST

`మా` అధ్యక్ష ఎన్నికల అంశం ఇప్పటికే హీటెక్కిస్తుంది. ఇప్పుడు `సోనూసూద్‌` మరింత హీటెక్కించబోతున్నాడు. `మా` అధ్యక్ష బరిలో రియల్‌హీరో సోనూ సూద్‌ కూడా దిగబోతున్నారనే వార్త టాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది.

PREV
18
`మా` ఎన్నికల హీట్‌ని పీక్‌లోకి తీసుకెళ్తున్న సోనూసూద్‌.. ప్రకాష్‌రాజ్‌తో ఢీ కొట్టబోయేది ఈ రియల్‌ హీరోనేనా?
ఈ సారి(2021-2023)కిగానూ త్వరలో `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌)కి ఎన్నికలు జరగబోతున్నాయి. సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు ప్లాన్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐదుగురు `మా` అధ్యక్ష బరిలోకి దిగారు. ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నర్సింహరావు పోటీలో ఉన్నట్టు ప్రకటించారు.

28
ప్రకాష్‌ రాజ్‌ తన ప్యానెల్‌ని ప్రకటించడంతోపాటు ప్రెస్‌మీట్‌ పెట్టి `మా`ఎన్నికలపై రచ్చని రాజేశాడు. లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే వివాదాలపై మరింత హాట్‌ హాట్‌ చర్చకు కారణమయ్యాడు. దీంతో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం `మా`కి గౌరవం తగ్గిపోయిందని తాను ఆ గౌరవాన్ని తీసుకొస్తామని తెలిపారు.

38
దీంతో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ దీనిపై ఘాటుగా స్పందించారు. తాము ఏం చేశామో తెలియజేశాడు. అదే సమయంలో ప్రకాష్‌ రాజ్‌కి చురకలంటించాడు. ఎలక్షన్లు ఎప్పుడు అని ప్రకాష్‌ రాజ్‌ పెట్టిన ట్వీట్‌కి, వాటర్‌ నిండకుండానే స్విమ్మింగ్‌ ఫూల్‌లో దూకుతా అన్నట్టుంది మీ వ్యవహారమంటూ సెటైర్లు వేశాడు.

Naresh

48
తెలంగాణ కళాకారులకు అన్యాయంజరుగుతుందని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేద కళాకారులకు న్యాయం చేయడం లక్ష్యంగా, తెలంగాణ ప్రత్యేకంగా `మా` ఉండాలని లక్ష్యంగా ముందుకొచ్చారు సీవీఎల్‌ నర్సింహరావు. దీంతో కొత్త వివాదానికి తెరలేపారాయన.

58
ఇదిలా ఉంటే మన సంస్థని, మన సమస్యలను మనమే బాగు చేసుకోవాలని, తనకు స్పష్టమైన అవగాహన ఉందని, పెద్దల అండ ఉందని ప్రకటించాడు మంచు విష్ణు. దీంతో `మా` ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది.

68
ఈ క్రమంలో తాజాగా సోనూ సూద్‌ పేరు తెరపైకి వస్తుంది. `మా` అధ్యక్ష బరిలో సోనూ సూద్‌ దిగబోతున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌ సర్కిల్‌లో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రకాష్‌ రాజ్‌కి దీటుగా నిలబడేందుకు సోనూ సూద్‌ అయితే బాగుంటుందని, అసలు మా అధ్యక్షుడిగా ఆయన అయితే మరింత బాగుంటుందని సినిమా పెద్దలు భావిస్తున్నారట.

Naresh

78
ఈ క్రమంలో సోనూసూద్‌ని రంగంలోకి దించాలనే ఆలోచనలో కొంత మంది టాలీవుడ్‌ పెద్దలు, అదే సమయంలో రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మంచు విష్ణు, జీవిత, హేమ, నర్సింహరావులను బరిలోనుంచి తప్పుకునేలా చేసి, సోనూని దించాలని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా, సోనూ సూద్‌ పేరు మాత్రం మారుమ్రోగుతుంది.

88
ఇక కరోనా సమయంలో అనంతమైన సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు సోనూసూద్‌. రియల్‌ హీరోగా, అసలైన్‌ సూపర్‌మేన్‌గా అభివర్ణిస్తున్నారు. ఆయన కూడా అంతే స్థాయిలో తన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏదేమైనా ఓ మంచి కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్‌ పేరు ఇప్పుడు `మా` అధ్యక్ష బరిలో వినిపించడం చర్చనీయాంశంగా మారింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories