హీరోయిన్ ని నిజంగానే కాలితో తన్నారా ? వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకి.. ఎన్టీఆర్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్

Published : Jan 22, 2026, 11:45 AM IST

ఎన్టీఆర్ సినిమా విషయంలో తాను డిస్టర్బ్ అయ్యాను అని ఓ స్టార్ డైరెక్టర్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ ని కాలితో తన్నే సన్నివేశం గురించి ఆ డైరెక్టర్ ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
జూ. ఎన్టీఆర్ సినిమాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్పగా నటించినప్పటికీ కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. సింహాద్రి తర్వాత యమదొంగ ముందు వరకు తారక్ కి బ్యాడ్ ఫేజ్ నడిచింది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలు చేసిన వర్కౌట్ కాలేదు. రాఖీ సినిమా సమయంలో తారక్ అవుట్ ఆఫ్ షేప్ లో కనిపించాడు. అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ తారక్ నటనలో పదును మాత్రం తగ్గలేదు.

25
రాఖీ సినిమాపై కృష్ణవంశీ కామెంట్స్ 

డైరెక్టర్ కృష్ణ వంశీ రాఖీ సినిమా విశేషాలని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాఖీ సినిమా విషయంలో తాను సంతృప్తిగా లేనని కృష్ణవంశీ తెలిపారు. ముఖ్యంగా దర్శకుడిగా నా వర్క్ నాకే నచ్చలేదు. తారక్ మాత్రం అద్భుతంగా నటించాడు. తారక్ డైలాగ్ మెమొరీ అద్భుతం. 

35
కాలితో తన్నే సన్నివేశం 

లెన్తీ డైలాగ్స్ ని కూడా తారక్ గుర్తుపెట్టుకుని అలవోకగా చెప్పేవాడు. ఆ సినిమాలో నటీనటులంతా బాగా చేశారు. ముఖ్యంగా సుహాసిని, షాయాజీ షిండే నటన కూడా చాలా బావుంటుంది. ఆ చిత్రంలో షాయాజీ షిండే.. సుహాసిని గారిని కాలితో తన్నే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ లో నిజంగానే ఆమెని కాలితో తన్నారు అనే ప్రచారం బయట ఉంది. కానీ అది వాస్తవం కాదు. ఆంత పెద్ద సీనియర్ యాక్టర్ ని పెట్టుకుని అలా ఎందుకు చేస్తాం అని కృష్ణవంశీ అన్నారు. 

45
నిజంగా అలా చేయలేదు 

షాయాజీ షిండే పర్ఫెక్ట్ టైమింగ్ ఉన్న నటుడు. కాలు ఎంత వరకు వెళ్ళాలి. ఎంత టైమింగ్ లో వెనక్కి తీసేయాలి అనేది ఆయనకు తెలుసు. ఆ సీన్ లో నిజంగా తన్నలేదు. అలా చూపించాం అంతే. అది కూడా సుహాసిని గారి అనుమతి తీసుకునే ఆ సీన్ చేసినట్లు కృష్ణవంశీ తెలిపారు. 

55
కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయిన నటి 

 క్లైమాక్స్ లో కోర్ట్ లో ఎన్టీఆర్ చెప్పే డైలాగులకు సుహాసిని గారు నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. కట్ చెప్పి 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చారు అని కృష్ణ వంశీ గుర్తు చేసుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories