డైరెక్టర్ హరీష్ శంకర్ ఇలా బుక్ అయ్యాడేంటి! పబ్లిక్ గా పరువు తీసేశాడు!

First Published | Aug 15, 2024, 9:17 PM IST

మిస్టర్ బచ్చన్ దర్శకుడు హరీష్ శంకర్ పరువు తీసేశాడు ఓ వ్యక్తి. స్టార్ డైరెక్టర్ అని కూడా లేకుండా అడ్డంగా బుక్ చేశాడు. ఇకపై హరీష్ శంకర్ చాలా జాగ్రత్తగా ఉంటాడేమో.. 
 
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న విడుదలైంది. రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. 80ల నాటి కథతో పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. రవితేజకు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఆకట్టుకోగా చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. పరాజయాల్లో ఉన్న రవితేజ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

HARISH SHANKAR

మిస్టర్ బచ్చన్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ రివ్యూలను ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి... ఫేక్ రివ్యూలు నమ్మకండి. సినిమా చాలా బాగుంది. మా రవితేజ అన్నకు మంచి కమ్ బ్యాక్ ఇచ్చావ్ హరీష్ అన్న, థాంక్యూ... అని కామెంట్ చేశాడు. ఎక్స్ లో చేసిన ఈ కామెంట్ కి హరీష్ శంకర్ ని ట్యాగ్ చేశాడు.

ఈ ట్వీట్ కి హరీష్ శంకర్ స్పందించారు. కృతఙ్ఞతలు అని అర్థం వచ్చేలా చేతులు జోడించిన ఎమోజీలు పోస్ట్ చేశాడు. హరీష్ శంకర్ రిప్లై కి సదరు వ్యక్తి ఎగతాళి పూర్వకంగా రిప్లై ఇచ్చాడు. నువ్వు రిప్లై ఇస్తావని తెలుసు సొల్లు రాశాను... అని నవ్వుతున్న ఎమోజీలు పోస్ట్ చేశాడు. దీనికి మరొక నెటిజన్ పప్పీ షేమ్ అంటూ కామెంట్ పెట్టాడు.

ఓ స్టార్ డైరెక్టర్ రిప్లై ఇచ్చాడని కూడా లేకుండా అడ్డంగా బుక్ చేశాడు. హరీష్ శంకర్ పరువు తీసేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. ఇక విడుదలకు ముందు హరీష్ శంకర్ రివ్యూలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సినిమా పై ఎలాంటి రివ్యూలు రాసినా పర్లేదు. నేను లెక్క చేయను అన్నారు. 

హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వాయిదా పడింది. త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. 

Latest Videos

click me!