అది మంచి సినిమా, రాజకీయ కారణాలతో డిజాస్టర్ చేశారు..జూ.ఎన్టీఆర్ మూవీపై సంచలన వ్యాఖ్యలు

First Published | Aug 15, 2024, 9:06 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలకు సైన్ చేస్తున్నాడు. ఆది చిత్రంతో మాస్ హీరోగా తారక్.. రాజమౌళి సింహాద్రి చిత్రంతో తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలకు సైన్ చేస్తున్నాడు. ఆది చిత్రంతో మాస్ హీరోగా తారక్.. రాజమౌళి సింహాద్రి చిత్రంతో తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత హిట్లు ఫ్లాపుల సంగతి ఎలా ఉన్నా ఎన్టీఆర్ వరుసగా మాస్ చిత్రాలు చేశాడు. కొన్ని హిట్స్ అయ్యాయి.. మరికొన్ని నిరాశపరిచాయి. 

ఎన్టీఆర్ నటించిన మాస్ యాక్షన్ చిత్రాల్లో దమ్ము ఒకటి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో బోయపాటి శ్రీను వరుస హిట్లతో జోరు మీద ఉండడంతో దమ్ము చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ అయ్యాక ఆ చిత్రం డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాపుల్లో దమ్ము చిత్రం ఒకటి. 


ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మించారు. తాజాగా ఇంటర్వ్యూలో కె ఎస్ రామారావు దమ్ము పరాజయం చెందడంపై స్పందించారు. దమ్ము మంచి చిత్రం కాదు అంటే నేను ఒప్పుకోను. చాలా అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం అది. అయితే ఆ మూవీ డిజాస్టర్ కావడం వెనుక కొన్ని కారణాలు బలంగా పనిచేశాయి. మొదటి కారణం అప్పటి రాజకీయ పరిస్థితులు. 

అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఈ చిత్రంపై బాగా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అని అన్నారు. అయితే ఆ రాజకీయ పరిస్థితులు ఏంటి అనేది మాత్రం వివరించలేదు. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. బహుశా తెలంగాణ ఉద్యమం ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని భావిస్తున్నారు. 

అదే విధంగా మరో కారణం కూడా ఉంది. ఈ చిత్రంలో సుమన్ క్యారెక్టర్.. ఆ పాత్ర చుట్టూ ఉన్న కథ సరిగ్గా వర్కౌట్ కాలేదు. అది చిన్న కారణం మాత్రమే. ప్రధాన కారణం అయితే రాజకీయ అంశాలే అని కేఎస్ రామారావు అన్నారు. చాలా చిత్రాలతో పోల్చుకుంటే దమ్ము బెస్ట్ కమర్షియల్ చిత్రం అని అన్నారు. 

ఆ చిత్రంలో హీరోయిన్ల విషయంలో బోయపాటితో విభేదాలు వచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది దాని గురించి కూడా కేఎస్ రామారావు వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఆ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. కానీ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల శృతి హాసన్ డేట్లు అడ్జెస్ట్ కాలేదు. కాబట్టి త్రిషని తీసుకోవాల్సి వచ్చింది. ఇది అందరం కలసి తీసుకున్న నిర్ణయం. ఎలాంటి విభేదాలు లేవు అని కేఎస్ రామారావు అన్నారు. 

Latest Videos

click me!