`మిస్టర్‌ బచ్చన్‌` నెగటివ్‌ టాక్‌కి ఐదు కారణాలివే.. హరీష్‌ శంకర్‌ ఎక్కడ మిస్టేక్‌ చేశాడంటే?

First Published | Aug 15, 2024, 9:02 PM IST

రవితేజ నటించిన `మిస్టర్‌ బచ్చన్‌` సినిమా నేడు విడుదలై థియేటర్లలో రచ్చ చేస్తుంది. అయితే దీనికి ఎక్కువగా నెగటివ్‌ టాక్‌ వస్తుంది. నెగటివ్‌ టాక్ కి ఐదు ప్రధాన కారణాలు చూస్తే. 
 

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన `మిస్టర్‌ బచ్చన్‌` ఈ గురువారం ఆడియెన్స్ ముందుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నార్త్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా చేయడం విశేషం. ఇది హిందీలో వచ్చిన `రైడ్‌` చిత్రానికి రీమేక్‌. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి ఎక్కువగా నెగటివ్‌ టాక్‌ వస్తుంది. మరి ఆ నెగటివ్‌ టాక్‌కి ప్రధానంగా ఐదు కారణాలేంటనేది చూస్తే..
 

సినిమా నెగటివ్‌ టాక్‌కి మొదటి కారణం ఇది రీమేక్‌ కావడం. ఇటీవల రీమేక్‌ చిత్రాలు ఆడటం లేదు. ఓటీటీలు విస్తరించడంతో ఏ భాషలోని కంటెంట్ అయినా ఇట్టే దొరుకుతుంది. దీంతో `మిస్టర్‌ బచ్చన్‌` రీమేక్‌ కావడంతో ఆ హైప్‌ మిస్‌ అయ్యింది. అదే సమయంలో రీమేక్‌ అంటే కంపారిజన్‌ ఉంటుంది. సేమ్‌ అలానే ఉందని, దీనికంటే అదే బాగుందని అంటుంటారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. రీమేక్‌ కంపారిజన్‌ కొంత ఎఫెక్ట్ అయ్యిందంటున్నారు. 
 


రెండో కారణం.. దర్శకుడు హరీష్‌ శంకర్ సినిమాని కిచిడీ చేశాడు. తెలుగుకి మార్చే క్రమంలో కుళ్లు జోకులు పెట్టారు. మొదటి భాగంలో మొత్తం అదే. అవి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నా, అందరిని మెప్పించలేకపోయాయి. పైగా ఆ కామెడీ అంత సహజంగా లేకపోవడం కూడా ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కలేదు. కమెడియన్లు చాలా మందే ఉన్నా, వారిని సరిగా వాడుకోకపోవడం మైనస్‌. మూడో కారణం.. హీరోయిన్‌ భాగ్య శ్రీ బోర్సేని గ్లామర్‌కి పరిమితం చేశారు. నటనకు ఏమాత్రం స్కోప్‌ లేకుండా చేశారు. హీరోయిన్‌ అందాలు, డాన్సులు చూపించడం కోసమే ఈ సినిమా చేశారా? అనే ఫీలింగ్‌ కూడా నెగటివ్‌ టాక్‌ కి కారణమైందని చెప్పొచ్చు. 

నాలుగో కారణం.. హరీష్‌ శంకర్‌ మొదటి భాగాన్ని అంతో ఇంతో లాక్కొచ్చినా సెకండాఫ్‌ని ఆయన డీల్‌ చేయలేకపోయాడు. ఏంచేయాలో తెలియక ఏదో చేసినట్టు ఉంది. సినిమా మొత్తం రైడ్‌ మీదనే, అది కూడా ఒకే ఇంట్లో కథని నడిపించాడు. ఎంతసేపు అక్కడక్కడే తిప్పాడు, బాగా సాగదీశాడు.. రైడ్‌కి సంబంధించిన ఎలిమెంట్లు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. హీరో, విలన్ల మధ్య సవాళ్లు రక్తికట్టలేదు. టమ్‌ అండ్‌ జెర్రీ లాంటి సీన్లు లేవు. ట్విస్ట్ లు, టర్న్ లు కూడా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. పైగా చాలా ట్విస్ట్ లు ఊహించేలా ఉన్నాయి, ఇలాంటివి ఎప్పుడో చూసేశాం అనే ఫీలిగ్‌ ఆడియెన్స్ లో కలుగుతుంది. 

ఐదో కారణం.. సినిమాలో ప్రధానంగా ఎమోషన్స్ మిస్‌ అయ్యింది. ఈ మూవీకైనా ఒక త్రెడ్‌ మెయిన్‌. దాని చుట్టూ ఎమోషన్స్ అల్లుకుంటూ సినిమాని తీస్తారు. ఆ ఎమోషనే సినిమాకి బ్యాక్‌ బోన్‌, మెయిన్‌ పిల్లర్‌ లాంటిది. ఇందులో అదే మిస్‌ అయ్యింది. రక్తికట్టించే డ్రామా మిస్‌ అయ్యింది. దర్శకుడు హరీష్‌ ఈ విషయంలో మెయిన్‌గా విఫలమయ్యాడు. సాంగ్స్ మీద పెట్టిన దృష్టి కథపై పెట్టి సెకండాఫ్‌ని బాగా డీల్‌ చేసి ఉంటే ఆకట్టుకునేది. దీనికితోడు 1980లో జరిగిన రైడ్‌ బేస్ట్ స్టోరీ. ఇప్పుడు జనాలు నిత్యం అలాంటివే చూస్తున్నారు. ఇందులో కొత్తదనం లేదు, కిక్‌ ఇచ్చే అంశమే లేదు. దీంతో సినిమాపై నెగటివ్ టాక్‌కి కారణమైంది. 
 

అయితే ప్లస్‌ లు చూస్తే.. రవితేజ యాక్టింగ్‌, భాగ్యశ్రీ బోర్సే అందాలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌, హీరోయిన్‌ని చూపించిన తీరు బాగుంది. పాటలు అదిరిపోయాయి. లవ్‌ ట్రాక్‌ కూడా కొంత వరకు బాగానే ఉన్నాయి. అక్కడక్కడ కామెడీ బాగుంది. ఇవి తప్ప సినిమాలో ప్లస్‌ అని చెప్పేవి లేవు. దీనికితోడు సినిమా ఎక్కువగా ఒకే ఇంట్లో తీశారు. ఓ స్టార్‌ హీరో సినిమాని పట్టుకుని ఇలా తీయడం కూడా మైనస్‌ గా చెప్పొచ్చు. మొత్తంగా ఇవి రవితేజ `మిస్టర్‌ బచ్చన్‌`ని దెబ్బకొడుతున్నాయని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. 

Latest Videos

click me!