రవితేజకు పితృవియోగం
తాను చేస్తున్న పనిమీద ఎంతో గౌరవం చూపిస్తుంటాడు మాస్ మహారాజ్ రవితేజ. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తన పని తాను పూర్తి చేయడానికే ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. తాజాగా రవితేజ మరోసారి తన డెడికేషన్ చూపించాడు. ఆమధ్య రవితేజ తన తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే. మాస్ మహారాజ తండ్రి రాజగోపాల్ రాజు వృధ్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో మరణించారు. నాలుగు రోజుల క్రితం తండ్రి చనిపోతే, తండ్రిమరణించిన రెండు రోజులకే తన కొత్త సినిమా RT76 షూటింగ్‌లో రవితేజ జాయిన్ అయ్యారు.