Chiranjeevi-Balakrishna
చిరంజీవి-బాలకృష్ణ సమకాలీన నటులు. నందమూరి తారక రామారావు నటవారసుడిగా బాలకృష్ణ పరిశ్రమలో అడుగుపెట్టాడు. బాల్యంలోనే సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. మరోవైపు చిరంజీవి ఎలాంటి నేపథ్యం లేకుండానే స్టార్ అయ్యాడు. అల్లు రామలింగయ్య అల్లుడు కావడం కెరీర్ బిగినింగ్ లో ఆయనకు కొంత మేలు చేసిందనే వాదన ఉంది.
చిరంజీవి టాలీవుడ్ టాప్ స్టార్ అయ్యాడు. బాలకృష్ణ సైతం చిరంజీవికి పోటీ ఇచ్చే స్థాయికి వచ్చాడు. చిరంజీవి-బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య రైవల్రీ మొదలైంది. కలెక్షన్స్, రికార్డుల విషయంలో మెగా-నందమూరి ఫ్యాన్స్ తరచుగా వాదులాడుకుంటూ ఉంటారు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని వార్ కి దిగుతారు.
Balayya, Chiranjeevi
చిరంజీవి-బాలయ్య మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో బాలకృష్ణ, చిరంజీవి పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. రాజకీయాల్లో ఫెయిల్ అయిన చిరంజీవిని బాలకృష్ణ నేరుగా ఎద్దేవా చేశాడు. అందరూ సక్సెస్ కాలేరు. మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరని అన్నారు.
Chiranjeevi-Balakrishna
కోవిడ్ సమయంలో అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసరావు ప్రభుత్వ ప్రతినిధులతో చిరంజీవి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమయంలో టాలీవుడ్ నుండి కొందరికి మాత్రమే ఆహ్వానం అందింది. ఈ సమావేశం పై బాలకృష్ణ విరుచుకుపడ్డారు. కొందరు మాత్రమే భేటీ కావడం ఏమిటీ? వీరంతా కలిసి భూములు పంచుకుంటున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయ్యాడు. పరిశ్రమ అంటే నువ్వు ఒక్కడివే కాదు. అందరిలా ఒక హీరో మాత్రమే అన్నాడు. గతంలో బాలయ్య, చిరంజీవి మధ్య కొంత సఖ్యత ఉన్నా.. ఈ పరిణామాల అనంతరం దూరం పెరిగింది. అయితే ఇప్పుడు చిరంజీవికి బాలయ్యను పొగడాల్సిన సందర్భం ఎదురైంది.
బాలకృష్ణ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ పెద్దలు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు హాజరు కావాలని చిరంజీవిని మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆహ్వానించారు. కాబట్టి చిరంజీవి-బాలకృష్ణ ఒకే వేదిక పంచుకోనున్నారు. బాలయ్య సినీ ప్రస్థానాన్ని కొనియాడుతూ చిరంజీవి ప్రసంగించాల్సి ఉంది.