రవితేజ, గోపీచంద్, నితిన్, అఖిల్ ఇలా అయితే కష్టమే.. ఫ్లాపుల్లో పోటీ, ఫేడ్ అవుట్ అయ్యే ప్రమాదంలో ఉన్న హీరోలు

Published : Nov 10, 2025, 03:57 PM IST

రవితేజ నుంచి అఖిల్ వరకు టాలీవుడ్ లో ఫ్లాపులతో పోటీ పడుతున్న హీరోల జాబితా ఈ కథనంలో ఉంది. ఇలాగే భవిష్యత్తులో కూడా ఫ్లాపులు కొనసాగితే ఈ హీరోలు ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. 

PREV
17
ఫ్లాపుల్లో పోటీ పడుతున్న హీరోలు

హీరోలు నిలబడాలంటే సక్సెస్ సాధించాల్సిందే. వరుసగా ఫ్లాపులు ఎదురవుతుంటే ప్రేక్షకులైనా, నిర్మాతలైనా కొంతకాలమే భరిస్తారు. స్టార్ హీరోలకు సైతం వరుసగా ఫ్లాపులు ఎదురవుతుంటే ఇబ్బంది తప్పదు. మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు. రవితేజ తో పాటు నితిన్, గోపీచంద్ లాంటి హీరోలు కూడా వరుస ఫ్లాపుల్లో పోటీ పడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

27
రవితేజ 

ధమాకా తర్వాత రవితేజకి ఒక్క హిట్టు కూడా లేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో పాటు రీసెంట్ గా విడుదలైన మాస్ జాతర కూడా ఫ్లాప్ అయింది. ధమాకాకి ముందు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ లాంటి ఫ్లాపులు ఎదురయ్యాయి. ఈ సినిమాలన్నింటి నష్టం 70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

37
నితిన్

నితిన్ కి అప్పుడెప్పుడో 2020లో కరోనా ప్రారంభానికి ముందు భీష్మ అనే హిట్ పడింది. ఆ తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. వరుస ఫ్లాపుల వల్ల చేతిలో ఉన్న ఎల్లమ్మ చిత్రం కూడా పోయింది. ఇటీవల నితిన్ వరుస ఫ్లాపుల వల్ల నిర్మాతలకు ఏకంగా 80 కోట్ల వరకు లాస్ వచ్చిందనే టాక్ ఉంది. రవితేజ, నితిన్ సినిమాల నష్టమే 150 కోట్ల వరకు ఉందట. 

47
గోపీచంద్

హీరో గోపీచంద్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత పదేళ్లలో గోపీచంద్ కి ఒక్క హిట్ కూడా లేదు. 2015లో సౌఖ్యం చిత్రంలో గోపీచంద్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత గౌతమ్ నందా నుంచి గత ఏడాది వచ్చిన విశ్వం వరకు అన్నీ ఫ్లాపులే. ఇకపై గోపీచంద్ తన పరాజయాలకు అడ్డు కట్ట వేయకపోతే ఫేడ్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

57
అఖిల్

అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అఖిల్ నుంచి ఏజెంట్ వరకు అన్నీ ఫ్లాపులే ఎదురయ్యాయి. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల అఖిల్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. పెళ్లి తర్వాత అయినా అఖిల్ కి కలిసి వస్తుందేమో చూడాలి.

67
వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి గద్దలకొండ గణేష్ తర్వాత సరైన హిట్ లేదు. ఎఫ్3 మాత్రం పర్వాలేదనిపించింది. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. 

77
శర్వానంద్

ఒకప్పుడు శర్వానంద్ నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శర్వానంద్ మీడియం బడ్జెట్ లో వైవిధ్యమైన కథలు ఎంచుకునే హీరో. అయినప్పటికీ శర్వానంద్ కి సరైన సక్సెస్ దక్కడం లేదు. త్వరలో శర్వానంద్ నుంచి బైకర్ అనే మూవీ రాబోతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories