రామ్ చరణ్ తో పోటీ పడలేకపోయిన విజయ్ దళపతి, యూట్యూబ్ లో చికిరి సాంగ్ సరికొత్త రికార్డ్

Published : Nov 10, 2025, 02:15 PM IST

విజయ్ దళపతికి షాక్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్  రామ్ చరణ్. ఆయన నటిస్తున్న పెద్ది  సినిమాలోని 'చికిరి' పాటకు వచ్చిన రెస్పాన్స్ ను  'జన నాయగన్' సినిమా కోసం విజయ్ పాడిన 'దళపతి కచేరి' పాట సాధించలేకపోయింది. 

PREV
14
అనిరుధ్ - ఏ.ఆర్. రెహమాన్ మధ్య పోటీ

తమిళంలో అనిరుధ్, ఏ.ఆర్. రెహమాన్ అగ్ర సంగీత దర్శకులు. ఇద్దరూ పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉన్నారు. అనిరుధ్ చేతిలో టాప్ హీరోల సినిమాలు ఉండగా, రెహమాన్ కూడా రామ్ చరణ్ 'పెద్ది' లాంటి చిత్రాలతో పోటీ ఇస్తున్నారు.

24
தளபதி கச்சேரி பாடல்

అనిరుధ్ సంగీతంలో విజయ్ 'జన నాయగన్' సినిమా నుంచి 'దళపతి కచేరి' పాట కొద్ది రోజుల క్రితం రిలీజైంది. ఈ పాటను విజయ్‌తో కలిసి అనిరుధ్ పాడారు. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు డ్యాన్స్ చేశారు. యూట్యూబ్‌లో రిలీజైనా ఈ పాట పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. 

34
చికిరి పాటతో రెచ్చిపోయిన రామ్ చరణ్..

'జన నాయగన్'కు పోటీగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి చికిరి పాట రిలీజైంది. దీనికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. చాలా కాలం తర్వాత రెహమాన్ తెలుగులో కంపోజ్ చేసిన పాట కావడంతో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్టే పాట ఉండటంతో యూట్యూబ్‌లో వైరల్ అయింది.

44
చరణ్ తో పోటీ పడలేకపోయిన విజయ్

యూట్యూబ్‌లో మొదటి రోజు అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ పాటగా 'చికిరి' రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 2.9 కోట్ల వ్యూస్ వచ్చాయి. కానీ విజయ్ 'దళపతి కచేరి' పాటకు 24 గంటల్లో 1.2 కోట్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. అయితే 'చికిరి' కంటే 'దళపతి కచేరి' పాటకే ఎక్కువ లైక్స్ వచ్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories