మహేష్ బాబు చీరకట్టి.. పూలు పెట్టుకున్న ఏకైక సినిమా..? అంత సాహసం ఎందుకు చేశాడు..?

First Published | Aug 4, 2024, 3:28 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబును యాక్షన్ సీన్స్ లో చూసుంటారు, కామెడీ, కాస్త రొమాన్స్ సీన్స్ లో చూసుంటారు. కాని ఆయన చీరకట్టుకుని.. పూలు కూడా పెట్టుకున్న సీన్ ఎప్పుడైనా చూశారా..? 
 

సినిమాల కోసం ఏ సాహసం చేయడానికైనా వెనకాడరు చాలామంది నటులు. సినిమాకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. వాళ్ళేమనుకుంటున్నారు.. వీళ్ళేమనుకుంటారు.. శత్రులుట్రోల్ చేస్తారు లాంటి కాన్సెప్ట్ లను అస్సలు పట్టించుకోరు. అయితే స్టార్ హీరోలు కూడా ఒక సందర్భంలో కొన్ని పనులుచేయక తప్పదు. 
 

అలాంటి వాటిలో హీరోలు చీరకట్టుకుని.. ఆడవేశం వేయడం కూడా ఒకటి. అసలు అంత స్టార్ డమ్ ఉన్న హీరోలు ఇలా చేయడానికి గుండె ధైర్యం ఉండాలి. దమ్ముండాలి. ప్రస్తుతం పుష్పకోసం అల్లు అర్జున్ చీరకట్టడం అందరికి తెలిసిందే. అయితే ఈ పనిని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడో చేసేశాడట. 


అవును సూపర్ స్టార్ మహేష్ బాబు చీరకట్టి.. పూలు కూడా పెట్టుకున్నారట. వింటానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఓ పాత్ర కోసం ఇలా చీరకట్టిన మహేష్.. పూలు పెట్టుకుని వయ్యారంగా నడిచిన సినిమా ఏదో కాదు.. మహేష్ టీనేజ్ లో ఉన్నప్పుడు వచ్చిన బాలచంద్రుడు సినిమా. ఈసినిమా కోసం మహేష్ బాబు ఓ సందర్భంలో చీరకట్టుకుని.. పూలు పెట్టుకుని రౌడీలను అట్రాక్ట్ చేసే సిన్ ఓకటి ఉంది. ఈసీన్ లో మహేష్ బాబను అస్సలు గుర్తు పట్టనివిధంగాఉంటాడు. అంతే కాదు చాలా క్యూట్ గా కనిపిస్తాడు. 

ఇలా మహేష్ బాబు కూడా తన కెరీర్ లో ఒక సారి చీరకట్టుకోక తప్పలేదు. అయితే కమర్షియల్ హీరోగా ఎదిగిన తరువాత మహేష్ ఇలాంటి సాహసం చేయలేదు. హీరోగా ఎంటర్ అయిన మహేష్.. ప్రిన్స్ మహేష్ గా చాలా కాలం కొనసాగారు.. ఆతరువాత పంధా మార్చి..మాస్ హీరోగా కూడా ఇమేజ్ సాధించాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 

ఇకప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. త్వరలో ఈమూవీ సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈమూవీని తెరకెక్కించబోతున్నాడు జక్కన్న. మూడేళ్ళకుపైగా ఈసినిమా షూటింగ్ కొనసాగే అవకాశం ఉంది. అమెజాన్ అడ్వెంచర్ మూవీగారూపొందబోతున్న ఈసినిమా ఎన్ని ఆస్కార్లు రాబడుతుందో చూడాలి. 

Latest Videos

click me!