Bharateeyudu 2
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా రూపొందిన `భారతీయుడు 2` చిత్రం గత నెలలోనే థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఓపెనింగ్స్ బాగానే ఉన్నా, రెండో రోజు నుంచే డిజాస్టర్‌గా నిలిచింది. ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో ఆడియెన్స్ రిజెక్ట్ చేశారు.
కమల్ హాసన్ నటనతో మ్యాజిక్ చేసినా లుక్స్ సెట్ కాలేదు. మేకప్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో విమర్శలు వచ్చాయి. పైగా సినిమా లెన్త్ కూడా పెరిగింది. శంకర ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు. ఆల్‌రెడీ జనం చూస్తున్నది, ఫేస్ చేస్తున్నదే అందులో చూపించారు. రొటీన్ ఫీలయ్యారు ఆడియెన్స్. మొత్తంగా `భారతీయుడు 2` ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. విడుదలై నెల రోజులు కూడా కాలేదు. ఓటీటీలో వస్తుంది. గత నెల 12న సినిమా విడుదల కాగా, ఇప్పుడు ఆగస్ట్ 9నే ఓటీటీలోకి రాబోతున్నట్టు ప్రకటించింది టీమ్. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది.
Bharateeyudu 2 Review
ఇదిలా ఉంటే ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించి నెట్ ఫ్లిక్స్ 120కోట్లకి రైట్స్ తీసుకుంది. కానీ సినిమా విడుదలయ్యాక సీన్ మొత్తం మారింది. థియేట్రికల్‌గా నిరాశపర్చడంతో, ఓటీటీలోనూ ఆదరణ కష్టం అని భావించిన ఓటీటీ సంస్థ.. ఒప్పందంలోకోత పెట్టిందట. సుమారు 50కోట్లు ఎగ్గొట్టిందట. కేవలం 70కోట్లు మాత్రమే చెల్లించిందని తెలుస్తుంది. దీంతో ఇది నిర్మాత లైకా ప్రొడక్షన్‌కిది భారీ నష్టమనే చెప్పాలి.
Bharateeyudu 2 Review
ఇక కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన `భారతీయుడు 2` సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య ముఖ్య పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్ నిర్మించింది. జులై 12న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. అయితే దీనికి మరో పార్ట్ కూడా ఉంది. `భారతీయుడు 3` కూడా త్వరలో రాబోతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో దీన్ని విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తుంది. దీనికి ప్రీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది.