Anupama : డైరెక్టర్ కు రాఖీ కట్టిన అనుపమా పరమేశ్వరన్.. హెచ్చరించిన రవితేజ!

Published : Feb 05, 2024, 10:18 AM IST

‘ఈగల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదికపైనే అనుపమా పరమేశ్వరన్ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. అందుకు రవితేజ RaviTeja ఆసక్తికరంగా స్పందించారు. 

PREV
16
Anupama : డైరెక్టర్ కు రాఖీ కట్టిన అనుపమా పరమేశ్వరన్.. హెచ్చరించిన రవితేజ!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ (Anupama Parameswaran) ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిస్తోంది. చివరిగా ‘కార్తీకేయ 2’, ‘18 పేజెస్’ వంటి చిత్రాలతో  మంచి సక్సెస్ అందుకుంది. 

26

ఇక నెక్ట్స్ ఈ ముద్దుగుమ్మ ‘ఈగల్’ Eagle చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ RaviTeja ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నిన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. 

36

నిన్న జరిగిన ఈ ఈవెంట్ లో అనుపమా పరమేశ్వరన్ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. చీరకట్టులో అందంగా మెరిసింది. అందరి చూపుతనపైనే పడేలా చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

46

అయితే.. నిన్న ఈవెంట్ లో అనుపమా చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. పైగా రవితేజ కూడా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ అనుపమా ఏం చేసింది.. రవితేజ ఏమన్నారంటే.. 

56

ప్రీ రిలీజ్ వేడుకలో వేదికపైనే ‘ఈగల్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని Karthik Ghattamaneniకి అనుపమా రాఖీ కట్టింది. తనను అన్నయ్యా అని పిలిచింది. గతంలో నాలుగు సినిమాలు కలిసి పనిచేయడంతో వారి మధ్య మంచి బంధం ఏర్పడిందన్నారు. 

66

దీనిపై మాస్ రాజా స్పందిస్తూ.. ‘అందమైన అమ్మాయిలు అన్నయ్య అని పిలువొద్దు’ అంటూ హెచ్చరించారు. ప్రతి హీరోయిన్ కు మాస్ రాజా ఇదే డైలాగ్ చెబుతూ.. వారిని పొగుడుతున్న విషయం తెలిసిందే. ఏదేమైనా ‘ఈగల్’ మూవీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!

Recommended Stories