లిప్ కిస్సులే లిప్ కిస్సులు.. డైరెక్ట్ గా యాంకర్ సుమ ముందే, రోషన్ గురించి టీవీ నటి అంత మాట అనేసింది ఏంటి

First Published | Feb 5, 2024, 9:57 AM IST

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, బుల్లితెర షోలతో బిజీగా గడుపుతోంది. గత ఏడాది చివర్లో సుమ తన కొడుకు రోషన్ కనకాలని హీరోగా పరిచయం చేసింది.

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, బుల్లితెర షోలతో బిజీగా గడుపుతోంది. గత ఏడాది చివర్లో సుమ తన కొడుకు రోషన్ కనకాలని హీరోగా పరిచయం చేసింది. రోషన్ నటించిన బబుల్ గమ్ చిత్రం పర్వాలేదనిపించింది. సుమ హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డా కార్యక్రమానికి సెలెబ్రిటీలు హాజరవుతుంటారు. త్వరలో వాలంటైన్స్ డే సందర్భంగా సుమ అడ్డా షోని రొమాంటిక్ గా ప్లాన్ చేశారు. 

బుల్లితెరపై లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటలని ఈ షోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలయింది. బుల్లితెరపై టివి సీరియల్స్ లో రాణిస్తున్న రియల్ లైఫ్ కపుల్స్ విష్ణుప్రియ, సిద్దు.. మృదుల, కృష్ణచైతన్య.. మోహిత్ ధరణి ప్రియా పాల్గొన్నారు. వీళ్లంతా ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలే. 


వీళ్లందరి చేత యాంకర్ సుమ దగ్గరుండి రొమాన్స్ చేయించింది. ఈ జంటలు ఏకంగా లిప్ కిస్సులతో చెలరేగిపోయారు. పెదాలతో చాక్లెట్ పంచుకుంటున్నట్లు చేస్తూ లిప్ కిస్సులు పెట్టుకున్నారు. క్లోజప్ గా ఈ లిప్ కిస్ లని చూపించారు. 

వాళ్ళు లిప్ కిస్సులు పెట్టుకుంటుంటే సుమ ఇస్తున్న రియాక్షన్ ఫన్నీగా ఉంది. సుమ ఊహించని విధంగా రియాక్షన్ ఇవ్వడంతో విష్ణుప్రియ కౌంటర్ ఇచ్చింది. మీరు మీ పిల్లలు కూడానా ఇలా చేయడం చూసేశారు.. మమ్మల్ని చూడడం ఒక లెక్కా ఏంటి అంటూ కౌంటర్ ఇచ్చింది. బబుల్ గమ్ చిత్రంలో రోషన్ కనకాల లిప్ కిస్సులతో రెచ్చిపోయాడు. 

అతడి గురించే విష్ణుప్రియ పరోక్షంగా కామెంట్స్ చేసింది.  బుల్లితెర జంటలు రొమాంటిక్ గా చేసిన డ్యాన్స్, స్కిట్ లు ఆకట్టుకున్నాయి. విష్ణుప్రియ , సిద్ధూ బొమ్మరిల్లు చిత్రంలో ఒక సన్నివేశాన్ని పేరడీ చేశారు. 

ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 10న టెలికాస్ట్ కానుంది. జస్ట్ ప్రోమోలోనే ఇంతలా లిప్ కిస్సులతో రెచ్చిపోయారు అంటే ఫుల్ ఎపిసోడ్ ఇంకెంత రచ్చ ఉంటుందో ఊహించుకోవచ్చు. 

Latest Videos

click me!