జయాపజయాలతో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ కి యూత్ లో భారీ క్రేజ్ ఉంది. ఆర్ ఎక్స్ 100 లో ఆమె చేసిన బోల్డ్ రోల్స్ అప్పట్లో యువతను ఊపేసింది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ ఎక్స్ 100 మూవీలో పాయల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది.
26
తర్వాత పాయల్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. రవితేజ, వెంకటేష్ వంటి స్టార్స్ పక్కన నటించినా ఆమెకు బ్రేక్ రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా నిరాశపరిచింది. ఆ చిత్రంలో పాయల్ మూగ అమ్మాయి పాత్ర చేసింది.
36
తాజాగా ఆమె మంగళవారం మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మరోసారి బోల్డ్ రోల్ చేసింది. శృంగార కోరికలతో సతమతమయ్యే అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది.
46
మంగళవారం చిత్రానికి అజయ్ భూపతి దర్శకుడు కావడం విశేషం. మంగళవారం హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే రాంగ్ టైం లో రిలీజ్ చేయడం వలన ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కాగా మంగళవారం మూవీ పాయల్ కి ప్రశంసలు తెచ్చిపెట్టింది.
56
పాయల్ ప్రస్తుతం తమిళంలో ఒకటి రెండు చిత్రాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా పాయల్ తన కెరీర్ బిగినింగ్ గుర్తు చేసుకుంది. 21 వయసులో ఒక మ్యాగజైన్ కోసం ఫస్ట్ ఫోటో షూట్ చేసిందట. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
66
పాయల్ రాజ్ పుత్ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. ఓ పంజాబీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆర్ ఎక్స్ 100 ఆమె మూడో చిత్రం. పాయల్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేశారు. పంజాబీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది.