అమ్మకి విషయం తెలియడంతో భయపడి ముంబయి ట్రైన్‌ ఎక్కి పారిపోయిన రవితేజ, మంటలు చెలరేగడంతో మర్చిపోలేని ఘటన

First Published | Nov 15, 2024, 7:27 PM IST

రవితేజ ఎనర్జిటిక్‌ స్టార్‌. ఆయన అల్లరి సినిమాల్లో కనిపిస్తుంది. ఇంట్లోనూ అంతే. అయితే ఓ సారి ఆయన చేసిన పని ఇంట్లో తెలియడంతో భయపడి ముంబయి ట్రైన్‌ ఎక్కి పారిపోయాడట. 
 

మాస్‌ మహారాజా రవితేజ ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. అటు సీనియర్లకి, ఇటు జూనియర్లకి మధ్య వారధిలా ఉన్నారని చెప్పొచ్చు. ఎలాంటి సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చి, చిన్న చిన్న పాత్రల్లో నటించి, ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మారి, అట్నుంచి నటుడిగా టర్న్ తీసుకున్నాడు. హీరో అయ్యాడు. తనని తాను మలుచుకుంటూ స్టార్‌ హీరోగా ఎదిగాడు.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

రవితేజ.. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ని స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చాడు. స్కూల్‌ టైమ్‌ నుంచే ఆయన్ని ఫాలో అయ్యేవాడు. సినిమాలన్నీ చూసేవాడు. సినిమాలో యాక్షన్‌ సీన్లు కూడా స్వయంగా ఇంట్లో చేసేవాడట. డైలాగులు మాత్రమే కాదు, ఫైట్ సీన్లు రీ క్రియేట్‌ చేసి హంగామా చేసేవాడట. అయితే ఈ సందర్భంగా జరిగిన షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుందట. రవితేజకి చిన్నప్పట్నుంచి సినిమాలంటే పిచ్చి. సినిమా రిలీజ్‌ అవుతుందంటే ఉదయం నాలుగున్నరకే ట్యూషన్‌ ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయేవాడట. 
 


థియేటర్లో క్యూ లైన్‌లో నిల్చునేవాడట. ఫస్ట్ టికెట్‌ తానే తీసుకోవాలనేది ఆయన ప్రయత్నం. కచ్చితంగా ఆ సినిమా చూడాల్సిందేనట. అయితే ఓ సారి దొరికిపోయాడు రవితేజ. స్కూల్‌కి వెళ్లకుండా థియేటర్‌ వద్దనే తిరిగాడట. అమ్మ చూసిందట. అమ్మకి విషయం మొత్తం తెలిసింది. సాయంత్రానికి ఇంటికి వచ్చే సమయంలో అమ్మకి తెలిసిపోయింది, ఇంటికెళ్లాక నీకు మామూలుగా ఉండదని తమ్ముడు హింట్‌ ఇచ్చాడట. 
 

దీంతో భయపడిపోయిన రవితేజ ఏం చేయాలో తోచలేదు. ఇంటికి రాకుండానే వెనక్కి తిరిగి అట్నుంచి అటు ముంబాయి ట్రైన్‌ ఎక్కేశాడట. ఆ ట్రైన్‌ ఎటుపోతుందో కూడా తెలియకుండా రైల్‌ ఎక్కాడట. కానీ ఆకలేసిందట. దీంతో మధ్యలోనే దిగిపోయాడట. మళ్లీ మార్నింగ్‌ ఉదయం వరకు ఇంటికి వచ్చేశాడట. అప్పటికే అమ్మకి కోపం తగ్గింది. దీంతో ఆ రోజు పెద్దగా ఏం అనలేదట. ఆ తర్వాత మరో సంఘటన చోటు చేసుకుంది. రవితేజకి సినిమా చూసి యాక్షన్‌ సీన్లని ఇంట్లో రీక్రియేట్‌ చేసేవాడట. 
 

ఓ సారి `ది బర్నింగ్‌ ట్రైన్‌` అనే హిందీ సినిమా చూశాడట రవితేజ. అగ్గిపెట్టే తీసుకుని సోఫాలు అంటించి అందులో ఫైట్‌ సీన్‌ చేశాడట. అయితే చిన్న మంటలు కాస్త పెద్దవి అయ్యాయి. తనకు కూడా కంట్రోల్‌ కావడం లేదు. దీంతో వణికిపోయాడట. ఏం చేయాలో తోయక బాగా భయపడిపోయాడట. అప్పుడే అమ్మ వచ్చిందట. ఏంటి పోగలు వస్తున్నాయని చూస్తే రవితేజ నిర్వాకం కనిపించిందట.

పాపం చిన్నపిల్లాడుగా కదా ఏం తెలియదు, బాగా భయపడిపోతున్నాడు, అప్పుడు తనే మంటలు ఆర్పి సెట్‌ చేసిందట. ఆ రోజు కూడా పెద్దగా ఏమలేదని చెప్పారు రవితేజ మదర్‌.  కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా షోలో ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్నప్పట్నుంచి చాలా అల్లరి అబ్బాయిని అని ఇప్పటికీ కూడా అదే అల్లరి చేస్తానని రవితేజ చెప్పారు. 
 

రవితేజ నటించిన సినిమాలు ఇటీవల వరుసగా పరాజయం చెందుతున్నాయి. చివరగా ఆయన `మిస్టర్‌ బచ్చన్‌` చిత్రంలో నటించారు. అది డిజాస్టర్‌ అయ్యింది. ప్రస్తుతం ఓ కొత్త డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు మూవీస్‌ ఉన్నాయి. 

read more:అన్నపూర్ణమ్మ చనిపోయినప్పుడు కాదు, ఏఎన్నార్‌ ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? నాగార్జున హీరో ఎంట్రీ వెనుక అంత బాధ ఉందా

also read: చిరు, నాగ్‌, బాలయ్య, ప్రభాస్‌, మహేష్‌ సరసన నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? రహస్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు

Latest Videos

click me!