మోక్షజ్ఞకు విలన్ గా స్టార్ హీరో కొడుకు, బాలయ్య ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే న్యూస్

First Published | Nov 15, 2024, 6:59 PM IST

మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి దర్శకుడు భారీగా సన్నద్ధం అవువుతున్నాడట. ఏకంగా ఓ స్టార్ హీరో కొడుకును విలన్ గా దించుతున్నాడట. ఈ మేరకు ఓ షాకింగ్ వెలుగులోకి వచ్చింది. 
 

Mokshagna Nandamuri

బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డెబ్యూ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 30 ఏళ్ళు. మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమైంది. లేట్ అయినా లేటెస్ట్ గా ఉండేలా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

కాగా మోక్షజ్ఞకు ఇష్టం లేకపోయినా... బాలకృష్ణ బలవంతంగా హీరో చేశాడనే వాదన ఉంది. మోక్షజ్ఞ మనసు మారాలని ఆయన యజ్ఞ యాగాదులు కూడా చేశాడట. ఎట్టకేలకు ఓ ఏడాది క్రితం మోక్షజ్ఞ ఓకే చెప్పారట. అప్పటి నుండి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారు. దర్శకుడు, కథ విషయంలో తర్జనభర్జన పడ్డారు. 


ప్రసుత్తం ఫుల్ ఫార్మ్ లో ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞను ఆయన చేతిలో పెట్టాడు బాలకృష్ణ. ఒక అద్భుతమైన కథను ప్రశాంత్ వర్మ సిద్ధం చేశాడట. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు హైలెట్ కానున్నాయట. బడ్జెట్ కూడా భారీగా పెట్టనున్నారట. ఇది సోషియో ఫాంటసీ జానర్ అట. మోక్షజ్ఞ రోల్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. సూపర్ హీరోగా మోక్షజ్ఞ కనిపించినా ఆశ్చర్యం లేదు. 

 మరోవైపు మోక్షజ్ఞకు జంటగా ఎవరు నటిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. హీరోయిన్ శ్రీలీల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శ్రీలీలకు బాలయ్యతో మంచి అనుబంధం ఉంది. భగవంత్ కేసరి చిత్రంలో శ్రీలీల కీలక రోల్ చేసిన సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి సెట్స్ లో శ్రీలీలను మోక్షజ్ఞ కలిశాడు. అప్పుడు వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. 

శ్రీలీల-మోక్షజ్ఞ జంట బాగుంటుందని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ పట్ల ఆడియన్స్ లో కొంత క్రేజ్ ఉంది. అయితే శ్రీలీల కాదంటూ మరో యంగ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంపిక చేశాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల రషా తడానీ ఆడిషన్స్ లో పాల్గొన్నారట. సంతృప్తి చెందిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞకు జంటగా ఎంపిక చేశాడంటూ వార్తలు వెలువడుతున్నాయి. 
 

dhruv vikram

కాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై మరో క్రేజీ వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో విలన్ గా ఓ స్టార్ హీరో కొడుకు నటిస్తున్నాడట. ఆయనెవరో కాదు ధృవ్ విక్రమ్. కోలీవుడ్ స్టార్ విక్రమ్ కుమారుడైన ధృవ్ పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. ఆదిత్య వర్మ, మహాన్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం బైసన్ పేరుతో ఒక చిత్రం చేస్తున్నాడు. 

ధృవ్ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ విలన్ రోల్ కోసం సంప్రదించాడట. సబ్జెక్టు నచ్చడంతో ధృవ్ పచ్చజెండా ఊపాడట. మోక్షజ్ఞ-ధృవ్ సిల్వర్ స్క్రీన్ పై తలపడటం ఖాయం అంటున్నారు. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. 
 

Latest Videos

click me!