నాగచైతన్య మరో సూపర్ నేచరుల్ థ్రిల్లర్ చేయటానికి సిద్దమవుతున్నారు. ఇలాంటి కథలతో ఎంతగా చైతూ ఇంపాక్ట్ చూపిస్తారో ఆ మధ్యన విడుదలైన ‘దూత’ సిరీస్ చాటి చెప్పింది.
త్వరలోనే చైతూ వెండితెరపై ఆయన పక్కా సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథతో సందడి చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్ లో తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమాలోనే పూజ హెగ్డే చైతు సరసన నటించబోతోందని తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Pooja Hegde
ఇండస్ట్రీ సోర్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు పూజ హెగ్డే అయితే తమ సినిమాకు పూర్తి న్యాయం చేస్తుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారట. ఈ మేరకు డిస్కషన్స్ ఇప్పటికే మొదలై జరుగుతున్నాయట.
పూజ కు కూడా స్క్రిప్టు నేరేషన్ పూర్తైందని తెలుస్తోంది. గత కొంతకాలంగా తెలుగులో పెద్దగా సినిమాలు చేయని పూజ ఈ సినిమాకు తనకు ఫెరఫెక్ట్ కమ్ బ్యాక్ అని భావిస్తోందిట. ఇంతకీ ఈ చిత్రం దర్శకుడు మరెవరో కాదు కార్తీక్ దండు.
pooja hegde
నాగచైతన్య హీరో గా... కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘విరూపాక్ష’తో విజయాన్ని అందుకున్న దర్శకుడు ఆయన. ప్రస్తుతం నాగచైతన్య కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసారు.
చైతూకి కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులు చకచకా సాగుతున్నట్టు సమాచారం. ఈ సినిమాని కూడా ‘విరూపాక్ష’ తరహాలోనే ఓ విభిన్నమైన థ్రిల్లర్ కథతో తెరకెక్కించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
బివిఎస్ఎస్ఎన్ ప్రసాద్ గతంలో చైతూతో 'దోచేయ్' అనే సినిమా.. అఖిల్ అక్కినేనితో 'మిస్టర్ మజ్ను' మూవీ చేశారు. గతంలో నాగేశ్వరరావుతో కూడా ఓ సినిమా నిర్మించారు. ఇప్పుడు చైతన్యతో మరో ప్రాజెక్ట్ చెయ్యడానికి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారు. కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'తండేల్' ..పాన్ ఇండియా మూవీ గా రూపొందుతోంది. ప్రేమమ్, సవ్యసాచి తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో లవ్ స్టోరీ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ క్రేజీప్రాజెక్ట్ సెట్స్ మీద వుండగానే డైరెక్టర్ కార్తీక్ దండు కథను చైతూ ఓకే చేసినట్లు తెలుస్తోంది.
read more:అన్నపూర్ణమ్మ చనిపోయినప్పుడు కాదు, ఏఎన్నార్ ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? నాగార్జున హీరో ఎంట్రీ వెనుక అంత బాధ ఉందా