Ravi Teja: 12 లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా?

Published : Aug 18, 2026, 03:35 PM IST

Ravi Teja: ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు శోభన్ బాబును ఆదర్శంగా తీసుకుని భూముల మీద డబ్బులు పెట్టారు… కోట్లలో సంపాదించారు. మాస్ మహారాజ రవితేజ కూడా 12 లక్షలు పెట్టి 100 కోట్లకు పైగా సంపాదించిన సంగతి మీకు తెలుసా?

PREV
14
స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టిన హీరోలు..

తెలుగు సినీ పరిశ్రమలో తమ కష్టార్జితాన్ని భూములు, స్థిరాస్తులలో పెట్టుబడిగా పెట్టడం పలువురు హీరోలకు అలవాటే. అలా దశాబ్దాల క్రితం తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ నేడు ఊహించని రీతిలో కోట్లకు చేరుకోవడం తరచూ చూస్తుంటాం. తాజాగా మాస్ మహారాజా రవితేజకు సంబంధించిన ఒక భారీ ఆస్తి గురించిన వివరాలు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా చర్చనీయాంశమవుతున్నాయి.

24
26 ఎకరాల విశాలమైన ఫామ్‌హౌస్

సినీ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల జరిగిన 'ఇరుముడి' చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో రవితేజ ఆస్తుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రవితేజ, అజయ్ ఘోష్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న 'మాస్ జాతర' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను ఆయన పంచుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని శంకర్ పల్లి దగ్గర రవితేజకు దాదాపు 26 ఎకరాల విశాలమైన ఫామ్‌హౌస్ (తోట) ఉందట. 'మాస్ జాతర' చిత్రానికి సంబంధించిన రైల్వే స్టేషన్ సెట్ తో పాటు ఇంటి సెట్‌లను ఈ తోటలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి షూటింగ్ నిర్వహించినట్లు అజయ్ ఘోష్ తెలిపారు.

34
12 లక్షలకు కొంటే వందల కోట్లు..

ఈ ఆస్తికి సంబంధించిన అసలు కథ ఏమిటంటే.. రవితేజ ఈ 26 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం కేవలం రూ. 12 లక్షలకు కొనుగోలు చేశారట. కాలక్రమేణా హైదరాబాద్ నగరం విస్తరించడం, శంకర్ పల్లి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ వందల కోట్ల రూపాయలకు చేరుకుందని అజయ్ ఘోష్ అన్నారు. ఈ వ్యాఖ్యల అధికారిక మార్కెట్ వ్యాల్యూపై ధ్రువీకరణ లేనప్పటికీ, శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఎంత భారీగా పెరిగాయో ఈ విషయం స్పష్టం చేస్తోంది.

44
ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి, మనం పోతాం...

అయితే, కోట్ల విలువైన ఆస్తి ఉన్నప్పటికీ రవితేజ వ్యక్తిత్వం ఎంత సాధారణంగా ఉంటుందో చెప్పడానికి అజయ్ ఘోష్ మరో సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి ఆ తోట విలువ గురించి ఆశ్చర్యపోతూ రవితేజను ప్రశ్నించగా.. ఆయన చాలా తత్వంతో కూడిన సమాధానమిచ్చారట. "ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి, మనం పోతాం.. ఇవన్నీ ఉన్నాయని సంతోషపడాలి తప్ప మన పని మనం చేసుకుంటూ పోవడమే ముఖ్యం" అని రవితేజ వ్యాఖ్యానించారట. ఆస్తుల పట్ల ఆయనకున్న ఆలోచనపై సినీ అభిమానులు అభినందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories