మహేష్ బాబు ఒక్కడు సినిమాకి ఎదురెళ్ళడం వల్ల ఎన్టీఆర్, రవితేజ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఒక్కడు ప్రభంజనాన్ని తట్టుకుని ఒకే ఒక్క మూవీ నిలబడగలిగింది. సూపర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో తొలి మాస్ హిట్ అంటే ఒక్కడు అనే చెప్పాలి. ఈ సినిమాతోనే మహేష్ బాబుకి టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ వచ్చింది. అప్పటి వరకు చాకొలేట్ బాయ్ లా కనిపించిన మహేష్ ని ఈ సినిమా నుంచి మాస్ ఆడియన్స్ కూడా ఫాలో కావడం ప్రారంభించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్ గా నటించింది. పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. మణిశర్మ సంగీత దర్శకుడు. 2003 సంక్రాంతికి విడుదలైన ఒక్కడు చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకి పోటీగా వచ్చి మహేష్ బాబు ప్రభంజనంలో కొట్టుకుపోయిన డిజాస్టర్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో జూ. ఎన్టీఆర్, రవితేజ సినిమాలు కూడా ఉన్నాయి.
25
ఈ అబ్బాయి చాలా మంచోడు
2002లో ఇడియట్, ఖడ్గం లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత 2003లో రవితేజ నటించిన చిత్రం ఈ అబ్బాయి చాలా మంచోడు. 2003 సంక్రాంతికి జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ అయింది. సరిగ్గా ఒకరోజు తర్వాత జనవరి 15న మహేష్ బాబు ఒక్కడు రిలీజ్ అయింది. అంతే.. ఒక్కడు మూవీ జోరులో రవితేజ చిత్రం కనిపించకుండా పోయింది. ఈ మూవీలో రవితేజ సరసన సంగీత హీరోయిన్ గా నటించింది.
35
ఎవరే అతగాడు
ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు తనయుడు వల్లభ హీరోగా నటించిన చిత్రం ఎవరే అతగాడు. ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ఒక్కడు చిత్రానికి సరిగ్గా నాలుగు రోజులు ముందు ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఒక్కడు ముందు నిలబడలేకపోయింది.
ఏఎం రత్నం నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా నాగ. డీకే సురేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. ఈ సినిమా విడుదలైన 5 రోజుల తర్వాత ఒక్కడు రిలీజ్ అయింది. దీనితో ఎన్టీఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది.
55
ఒక్కడు జోరుని తట్టుకుని నిలబడిన ఒకే ఒక్క మూవీ
ఒక్కడు మూవీ రిలీజైన రోజునే మరో సినిమా విడుదలయింది. అంతే కాదు ఒక్కడు ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడి ఆ చిత్రం హిట్ గా నిలిచింది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. పెళ్ళాం ఊరెళితే. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రంలో సంగీత, రక్షిత హీరోయిన్లుగా నటించారు. అశ్విని దత్, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.