44 ఏళ్ళు వచ్చినా అనుష్క శెట్టి ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? మ్యారేజ్ పై స్వీటీ అభిప్రాయం ఏంటి?

Published : Nov 07, 2025, 09:44 AM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తరువాత హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటారు. కానీ 44 ఏళ్లు వచ్చినా.. అనుష్క ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు. ? 

PREV
15
స్టార్ హీరోయిన్ గా అనుష్క శెట్టి

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన హీరోయిన్లంతా టాలీవుడ్ లో స్టార్లుగా వెలుగు వెలిగారు. సౌందర్య నుంచి అనుష్క శెట్టి వరకూ .. ఎంతో మంది తారలు హీరోయిన్లుగా టాలీవుడ్ ను ఏలారు. మరీ ముఖ్యంగా అనుష్క శెట్టి స్టార్ హీరోలకు సమానంగా ఇమేజ్ సంపాదించడంతో పాటు.. భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంది. గ్లామర్ హీరోయిన్ గా స్టార్ హీరోలతో ఆడిపాడిన స్వీటీ.. ఆతర్వాత కాలంలో ఉమెన్ సెంట్రిక్ సినిమాలతో దుమ్మురేపింది. అనుష్క జేజమ్మ పాత్రలో నటించిన అరుంధతి సినిమా ఇండస్ట్రీ హిట్ గా చరిత్ర సృస్టించింది. అనుష్క కెరీర్ లో లాండ్ మార్క్ మూవీగా అరుంధతి నిలిచిపోయింది. అనుష్క కెరీర్ లో గుర్తుండిపోయే మరో సినిమా బాహుబలి. ఈసినిమాలో దేవసేనగా ఆమె నటన పాన్ ఇండియా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందని చెప్పాలి. ఆతరువాత కాలంలో సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్ధం లాంటి ప్రయోగాత్మక పాత్రలతో అలరించింది స్వీటి. ప్రస్తుతం సినిమాలు తగ్గించింది సీనియర్ హీరోయిన్.

25
44 ఏళ్లు వచ్చినా పెళ్ళి చేసుకోని అనుష్క..

తాజాగా అనుష్క శెట్టి 44 వ ఏట అడుగు పెట్టింది. కానీ ఇప్పటికీ ఆమె బ్యాచిలర్ హీరోయిన్ గానే ఉండిపోయింది. ఇంత ఏజ్ వచ్చినా అనుష్క ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? పెళ్లిపై స్వీటీ అభిప్రాయం ఏంటి? అసలు ఆమె పెళ్లి చేసుకుంటుందా..? లేక బ్యాచిలర్ లైఫ్ ను గడిపేస్తుంది. ఈ విషయంలో స్వీటీ ఏమన్నది? ఫిల్మ్ ఇండస్ట్రీలో లైఫ్ టైమ్ బ్యాచిలర్ స్టార్స్ చాలామంది ఉన్నారు. నగ్మ, టబు, సితార లాంటి స్టార్స్ ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వాళ్లు పెళ్లి చేసుకోమని చెప్పేశారు. ఆ హీరోయిన్లు ఏజ్ కూడా 50 ఏళ్లు దాటిపోయింది. కానీ అనుష్క శెట్టి మాత్రం తాను పెళ్ళి చేసుకుంటాననే చెపుతోంది.

35
ఇండస్ట్రీ వ్యక్తిని చేసుకోను..

తాను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటోంది అనుష్క శెట్టి. కానీ తనుకు నచ్చిన వ్యక్తి ఇంత వరకూ దొరకలేదంటోంది. గతంలో ఓ సందర్భంలో పెళ్లి గురించి మాట్లాడిన అనుష్క.. ఇండస్ట్రీ వ్యక్తిని మాత్రం తాను పెళ్లాడనని చెప్పేసింది. తన మనసు మెచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా పెళ్ళి చేసుకుంటానంటోంది.బాహుబలి సినిమా తరువాత తనపై పెళ్లి పై ఒత్తిడి పెరిగిందని.. కానీ పెళ్ళి చేసుకోవాలి అంటే.. ప్రేమ ఉండాలి కదా.. అది లేకుండా తనకు ఎవరినీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది.కానీ ఏదిఏమైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం చేసుకోనని తేల్చి చెప్పేసింది స్వీటి. అంతే కాతు తనకు పిల్లలంటే చాలా ఇష్టమని.. కచ్చితంగా పెళ్లి చేసుకుని పిల్లలను కని, వాళ్ల బాగోగులు చూసుకుంటానని అంటోంది అనుష్క శెట్టి. కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం స్వీటి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు.

45
అనుష్క శెట్టి లవ్ రూమర్స్..

ఇక అనుష్క పెళ్లిపై చాలా కాలంగా రకరకాల రూమర్స్ వైరల్ అవుతూ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఆమె ప్రభాస్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. కొంత మంది అయితే వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఏఐ ఫోటోలు కూడా సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతే కాదు వీరు ప్రేమలో ఉన్నారని, అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారని, పెళ్లి చేసుకోడానికి వెయిట్ చేస్తున్నారని ప్రచారం గట్టిగా నడిచింది. కానీ వీటిని ఎప్పుడూ పట్టించుకోలేదు ప్రభాస్, అనుష్క. ఇలాంటి వాటిపై ఎప్పుడు స్పందించలేదు కూడా.

55
ఫస్ట్ లవ్ గురించి అనుష్క కామెంట్స్

అనుష్క, తన స్కూల్ డేస్‌లోనే ప్రేమలో పడిందట. తన ఫస్ట్ లవ్ కు సబంధించిన చిన్న అనుభవాన్ని గతంలోనే ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది టాలీవుడ్ బ్యూటీ. తన ఫస్ట్ లవ్ గురించి అనుష్క మాట్లాడుతూ, “స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు, తనంటే చాలా ఇష్టం కానీ నేరుగా చెప్పడానికి సిగ్గుపడి, తన స్నేహితుడి ద్వారా 'ఐ లవ్ యూ' అని చెప్పించాడు. అది వినగానే నాకు నవ్వు వచ్చింది. కానీ, ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయాను. ‘నేను అతన్ని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు ’' అని అనుష్క అన్నారు. ఈ అమాయక ప్రేమ అనుభవం చాలా మందికి వారి స్కూల్ జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. అనుష్క కు కూడా స్కూల్ డేస్ లో ఎదురైన ఈ అనుభవం ఆమెకు జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. కానీ ఆ అబ్బాయి ఎవరో ఆమె ఇప్పటి వరకు ఆమె వెల్లడించలేదు.

Read more Photos on
click me!

Recommended Stories