Illu illalu pillalu Today Episode: భద్రావతి కుట్రకు నర్మదా బలి, లంచం కేసులో ఇరుక్కున్న నిజాయితీ ఆఫీసర్ నర్మదా

Published : Nov 07, 2025, 09:01 AM IST

Illu illalu pillalu Today Episode: నర్మదా లంచం తీసుకొని దొరికిపోయిందని అన్నట్టు దీంతో ఆమె ఉద్యోగం పోయినట్టు వార్తలు వస్తాయి. భద్రావతి కుట్రకు నర్మదా బలైపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడే మొదలవుతుంది. 

PREV
15
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో నర్మదా తన అత్త వేదపతితో మాట్లాడటానికి కిచెన్ కి వెళ్లడంతో ఎపిసోడ్ మొదలవుతుంది. వేదవతి చాలా సీరియస్ గా ఉంటుంది. నర్మదా ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. కోపంలో మీరు మరింత అందంగా ఉంటారు అని అంటుంది. ప్లీజ్ అత్తయ్య మాట్లాడండి అని బతిమిలాడుతుంది. మీరు ప్రేమగా నవ్వుతూ మాట్లాడకపోతే నాకు ఏదో ఒక బ్యాడ్ జరుగుతుంది అని అంటుంది. వేదవతి వినిపించుకోదు. మీ అక్క వాళ్ళకు ఎదురు వెళ్తున్నా అని మీరు నాతో మాట్లాడడం లేదు.. కానీ అది నా డ్యూటీ మీరు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది.

25
లంచం తీసుకుంటూ

నర్మదా ఆఫీస్ కు ఒక వ్యక్తి వస్తాడు. అతను ఫోన్లో మాట్లాడుతూ సార్ మీరు చెప్పినట్లే ఇక్కడికి వచ్చాను. పని పూర్తి చేసి మీకు కాల్ చేస్తాను అని నర్మద దగ్గరకు వెళ్తాడు. తన పొలం రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఫైల్ ఇస్తాడు. నర్మదా ఆ ఫైల్ సరిగ్గా లేదని, కుదరదని చెబుతుంది. అయితే ఆ ఫైల్ లో చివరి పేజీ చూడమని చెబుతాడు. అక్కడ డబ్బు కనిపిస్తుంది. డబ్బులు చూసి నర్మదా కోపంగా.. ఏంటీ లంచం ఇవ్వాలని చూస్తున్నావా అని కోపంగా అరుస్తుంది. ఈ లోపే ఏసీబీ అధికారులు, పోలీసులు, మీడియా వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. నర్మదా లంచం తీసుకున్నట్లే వాళ్ళు భావిస్తారు. అతడు కూడా నర్మదనే డబ్బు అడిగిందని చెబుతాడు. దీంతో నర్మదా ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతుంది. రిమాండ్ కు కూడా వెళ్లాల్సి వస్తుందని చెప్పి పోలీసులు వెళ్లిపోతారు.

35
ఇడ్లీ బాబాయ్ రాజభోగం

ఇక రామరాజు ఇంట్లో ఆనందరావు, భాగ్యం సంతోషంగా ఉంటారు. శ్రీవల్లి కూడా భలే ఎంజాయ్ గా ఉంది కదా మీకు అని అంటుంది. ఈలోపే నర్మద లంచం తీసుకున్న వార్తలు టీవీలో చూస్తుంది. అది చూసి ఆనందంతో సంబరపడిపోతుంది. నర్మదా పని అయిపోయింది అని ఫీల్ అవుతుంది. ఆనందంగా శ్రీవల్లి ఇంట్లో ఉన్న వారందరినీ పిలుస్తుంది. వేదవతి వచ్చి ఆ న్యూస్ చూసి షాక్ అవుతుంది

45
షాక్ అయిన ఫ్యామిలీ

నర్మద గురించిన న్యూస్ టీవీలో చూసి ఫ్యామిలీ షాక్ అవుతుంది. నర్మదా లంచం తీసుకుంది కాబట్టి ఇలా జరిగిందని శ్రీవల్లి అంటుంది. దీంతో అందరూ ఆమె మీద అరుస్తారు. వేదవతి మాత్రం చాలా టెన్షన్ పడుతుంది. వెంటనే రామరాజుకి ఫోన్ చేయమని అంటుంది. కానీ రామరాజుకు ఫోన్ కలవదు. దీంతో వేదవతి నర్మదకు ఫోన్ చేసి ఏమైందో కనుక్కోమని చెబుతుంది. అందరూ నర్మద ఇలా చేయదని నమ్ముతారు. శ్రీవల్లి మాత్రం సూటిపోటి మాటలు మాట్లాడుతుంది.

55
ఆనందంలో భద్రావతి

ఇంట్లో అందరూ బాధపడుతున్నా శ్రీవల్లి, ఇడ్లీ బాబాయ్, భాగ్యం మాత్రం ఆనందంతో డ్యాన్సులు వేస్తారు. ఇంకా భద్రావతి, సేనాపతి వార్తల్లో వస్తున్న నర్మదను చూసి ఆనందంతో నప్పుకుంటారు. మనతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. దాని పతనానికి అదే గొయ్యి తీసుకుంది. ఇప్పుడు మనమంటే భయం పుడుతుంది అనుకుంటారు. భద్రావతి పేరు వినిపిస్తేనే ఇకపై వణికిపోవాలి.. ఈపాటికి ఫ్యామిలీ మొత్తం ఏడుస్తూ ఉంటారు అని భద్రావతి, సేనా మాట్లాడకుంటూ ఉంటారు. రామరాజుకి ఈ విషయం తెలిస్తే పరువు పోయిందని అవమానంతోనే చచ్చిపోతాడు అని అంటారు. ఈ లోపు నర్మదా బాధగా ఇంటికి వస్తూ వారికి కనిపిస్తుంది. వీరిద్దరూ బయట నిల్చుని లంచం తీసుకొని దొరికిపోయింది అంటూ వెటకారం చేస్తూ ఉంటారు. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories