తెలంగాణా నేపధ్యం... రవితేజ పేరేమో లక్ష్మణ్‌ భేరి...టైటిల్ ఏమో

First Published | Aug 10, 2024, 5:15 PM IST

రవితేజ ఇందులో లక్ష్మణ్‌ భేరి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగే

రవితేజ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాపై అదిరిపోయే బజ్ ఉంది. ఈ సినిమా తర్వాత రవితేజ  75వ చిత్రం ని సైతం ప్రకటించారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించనున్నారు.  పూర్తి స్దాయి ఫన్ ఎంటర్టైన్మెంట్ తో సాగే ఈ చిత్రం పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో రవితేజ ఈ సినిమాను ఒకే చేశాడు.. ఈ సినిమా టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
 

 
రవితేజ  గతంలో వచ్చిన మాస్ యాక్షన్ జోనర్ కాకుండా మళ్లీ తన మార్క్ కామెడిని ఈ సినిమా చూపించబోతున్నారని తెలుస్తుంది.. ఈ సినిమా టైటిల్ పై  ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అదేమిటంటే ఈ సినిమా టైటిల్ కోహినూర్. ఓ డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కించబోతున్నారు. వింటేజ్ రవితేజ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. 



రవితేజ ఇందులో లక్ష్మణ్‌ భేరి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందనున్నట్లు అర్థమవుతోంది.  ఉగాదికి రిలీజ్ చేసిన పోస్టర్ లో ‘‘2025 సంక్రాంతికి రవన్న దావత్‌ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి’’ అంటూ స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. ఈ చిత్ర నిర్మాణంలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థ భాగస్వామిగా వ్యవహరించనుండగా.. శ్రీకర స్టూడియోస్‌ సంస్థ సమర్పించనుంది.


 ఈ సినిమాలో రవితేజ నిరుద్యోగిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది.. వెంకీ సినిమాలోలాగా ఈ సినిమాలో కనిపించునున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాణం లో ఈ సినిమా తెరకెక్కనుండగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుందని ప్రకటించారు..

శ్రీ విష్ణు 'సామజవరగమన'తో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న యువకుడు భాను భోగవరపు. ఆ సినిమాకు ముందు సందీప్ కిషన్ 'గల్లీ రౌడీ', సత్య 'వివాహ భోజనంబు' సినిమాలకు రచయితగా పని చేశారు. ఆయన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు రవితేజ.  మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా మరోవైపు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు..

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ (Ravi Teja) వరుస సినిమాల్లో నటిస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు. గతేడాది నుంచి హిట్ చిత్రాలతో తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. దర్శకుడు గోపీచంద్ మాలినేని, రవిజేత కాంబినేషన్ లో వచ్చిన ‘క్రాక్’ సినిమా నుంచి మాస్ మహారాజ విభిన్న కథలను, కథాంశాలను ఎంచుకుంటున్నారు. 
 

Latest Videos

click me!