Rashmika Vs Kiara: ప్రభాస్ కోసం పోటీపడుతున్న రష్మిక మందన్న, కియార అద్వాని, మరి ఛాన్స్ ఎవరికి...?

First Published | May 13, 2022, 8:13 PM IST

అసలే టాలీవుడ్ ఇద్దరే ఇద్దరు హీరోయిన్ల హవా నడుస్తుంటే.. వారి మధ్యలో వచ్చి గట్టి కాంపిటిషన్ ఇస్తోంది మరో భామ.  ప్రభాస్ కోసం నేషనల్ క్రష్ ఎదరు చూస్తుంటే.. బాలీవుడ్ బ్యూటీ వచ్చి ఆ అవకాశం తన్నుకుపోయేలా కనిపిస్తుంది. 

ప్రభాస్ కోసం పోటీపడుతున్నారు ఇద్దరు స్టార్ హీరోయిన్లు. వరుస ప్లాప్స్ వచ్చినా..యంగ్ రెబల్ స్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అటు నేషనల్ క్రష్ రష్మిక, ఇటు బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియార అద్వాని ఇద్దరు ప్రభాస్ పక్కన ఛాన్స్ కోసం పోటీపడుతున్నారు. 

ప్రభాస్ తో సినిమా చేయాలి అని స్టార్ హీరోయిన్లు కూడా ఆరాటపడుతుంటారు. అయితే టాలీవుడ్ నుంచి పూజా హెగ్డే ఆ కోరిక తీర్చేసుకుంది. ఇక మరో స్టార్ హీరోయిన్ రష్మిక ప్రభాస్ తో నటించాలని తెగ ట్రై చేస్తోంది. అవకాశం కోసం ఎదురు చూస్తోంది. 
 


ప్రభాస్ వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో ఐదు సినిమాల వరకూ ఉన్నాయి. అందులో అర్జున్ రెడ్డిఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీ కోసం హీరోయిన్ల వేట జరుగుతోంది. ఇందులో రష్మికను తీసుకోవాలి అని అనుకున్నారట మేకర్స్. 
 

తెలుగు .. తమిళ భాషల్లో రష్మికకి మంచి క్రేజ్ ఉంది. ఇక బాలీవుడ్ లోను చక్రం తిప్పే ఛాన్స్ కోసం అమ్మడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఆమె అదృష్టం ఎలా ఉందనేది ఈ ఏడాది తెలిసిపోవచ్చు. పుష్పలో శ్రీవల్లి పాత్రలో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ, పుష్ప 2 సినిమా కోసం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.  ఇంత క్రేజ్ ఉండటంతో ప్రభాస్ పక్కన తనకు ప్లేస్ పక్కా అనుకుంది రష్మిక. 
 

ఇక తమిళంలో కార్తి జోడీగా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, తమిళ .. తెలుగు భాషల్లో రూపొందే ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా విజయ్ సరసన. విజయ్ హీరోగా ఆయన 66వ సినిమా రూపొందనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. 

ఆ తరువాత సినిమాను ఆమె ప్రభాస్ సరసన దాదాపు ఫిక్స్ అయ్యింది అనుకున్నారంతా..కాని ఇప్పుడు సడెన్ గా సీన్ లోకి కియారా అద్వాని వచ్చి చేరింది. కియారాను తీసుకుంటే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారట మేకర్స్. అటు రష్మికను సంప్రదిస్తూనే కియారాను కూడా సీక్రేట్ గా లైన్ లోకి లాగుతున్నారట. 

టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి బాలీవుడ్ కే పరిమితం అయిన కియారా అద్వాని.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ పాన్ ఇండియా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. ప్రస్తుతం శంకర్ ,రామ్ చరణ్ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. మరో మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తోంది. 

ప్రబాస్ లాంటిస్టార్ హీరోతో సినిమా అంటే కియారా వదిలేసుకునే అవకాశం లేదు. అటు రష్మిక కూడా ప్రభాస్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా కోసం  ఇద్దరినీ తీసుకుంటారా? లేక ఎవరినైనా ఒకరినే ఎంపిక చేసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇందులో ఎవరికి ఆశ నేరవేరుతుందో... ఏ హీరోయిన్ కు నిరాశ ఎదురవుతుందో చూడాలి. 

Latest Videos

click me!