ఢీ పూర్ణ తన లవర్ అంటూ షాకిచ్చిన జబర్దస్త్ నరేష్ ... ప్రూఫ్స్ చూపెట్టడంతో నోరెళ్లబెట్టిన రష్మీ..!

First Published May 13, 2022, 6:15 PM IST

జబర్దస్త్ నరేష్‌ ఇన్నాళ్లు సింగిల్‌గానే ఉన్నాడని అంతా నమ్ముతూ వచ్చారు. కానీ ఉన్నట్టుండి పెద్ద షాకిచ్చారు. తనకు కూడా గర్ల్ ఫ్రెండ్‌ ఉందని వెల్లడించారు. ఏకంగా ప్రూఫ్స్ చూపించి మరి షాకివ్వడం విశేషం. 

జబర్దస్త్ నరేష్‌.. చేసే కామెడీ ఏం రేంజ్‌లో నవ్వులు పూయిస్తుందో తెలిసిందే. ఆయనపై ఇతర కమేడియన్లు వేసే పంచ్ లు, నరేష్‌ చేసే ఓవరాక్షన్‌ ఆద్యంతం కామెడీని పంచుతుంటాయి. అంతగా ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు నరేష్‌. అందరిలోనూ తనకంటూ ఓ స్పెషాలిటీని సొంతం చేసుకున్నారు. `జబర్దస్త్`లో అత్యంత పారితోషికం అందుకుంటున్న కమేడియన్లలో ఒకరిగా రాణిస్తున్న నరేష్‌ లేటెస్ట్ యాంకర్‌ రష్మి, పూర్ణ, ఇంద్రజలకు పెద్ద షాకిచ్చాడు. 
 

నరేష్‌ ఇన్నాళ్లు సింగిల్‌ అని అంతా నమ్ముతుంటారు. మనోడికి లవర్స్ ఎవరూ లేరనే టాక్‌ ఉంది. కేవలం జబర్దస్త్ లో స్కిట్లు చేయడం మాత్రమే తెలుసని, ఎంతో ఇన్నోసెంట్‌ అనే టాక్‌ ఉంది. కానీ జబర్దస్త్ షోలోనే ఓ అమ్మాయిని పడేశాడు నరేష్‌. ఏకంగా ప్రూఫ్స్ చూపించి మరీ తన ప్రేమని వెల్లడించారు. అది ఎవరో కాదు కొత్తగా జడ్జ్ గా వచ్చిన పూర్ణ కావడం విశేషం. కెవ్వు కార్తీక్‌తో కలిసి స్కిట్‌ చేసిన నరేష్‌ తనకు కూడా ఓ గర్ల్ ఫ్రెండ్‌ ఉందని చెప్పగా, కార్తీక్‌ నమ్మడు. పూర్ణ ఎవరో తెలుసా నా గర్ల్ ఫ్రెండ్‌ అని స్టేజ్‌పైనే ప్రకటించాడు నరేష్‌. కానీ కార్తీక్‌ నమ్మకపోవడమే కాదు, నువ్వు చెబితే ఎవరూ నమ్మరని అనడంతో రెచ్చిపోయాడు నరేష్‌. అందుకు ప్రూఫ్‌ కూడా చూపించాడు. 

`రాధేశ్యామ్‌`లో ట్రైన్‌ సీన్‌లో హీరోయిన్‌ పూజా హెగ్డేని, ప్రభాస్‌ మోసే సీన్‌ ఒకటి ఉంటుంది. అలా పూర్ణని తాను మోస్తున్నట్టుగా, ఫోటో మార్ఫింగ్‌ చేయించాడు నరేష్‌. ఏకంగా దాన్ని పెద్ద పోస్టర్‌లా చేయించి జబర్దస్త్ స్టేజ్‌పై చూపించాడు. ఇది చూసి ఏకంగా పూర్ణ షాక్‌ అవుతుంది. అంతేకాదు యాంకర్‌ రష్మి నోరెళ్ల బెట్టడం విశేషం. 
 

దీనిపై రష్మి స్పందిస్తూ, నరేష్‌.. నువ్వు పూర్ణ బరువు మోస్తావా? అని ప్రశ్నించగా, మోసేస్తా అని చెప్పడం ఆద్యంతం నవ్వులు పూయించింది. జబర్దస్త్ షోలో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతటితో ఆగలేదు నరేష్‌. 

ఇదేం చూశావంటూ మరో పోస్టర్‌ చూపించారు. అందులో `బాహుబలి`లో ప్రభాస్, అనుష్క కలిసి విల్లు ఎక్కుపెట్టి బాణాలు వేస్తున్న పిక్‌లో అనుష్క ముఖాన్ని పూర్ణతో, ప్రభాస్‌ స్థానంలో తన ఫేస్‌ని జోడించి మరో పోస్టర్‌ డిజైన్‌ చేయించాడు. దీంతో మరోసారి అంతా ఘోళ్లున నవ్వారు. ఇదేంటని కార్తీక్‌ ప్రశ్నించగా, `పూర్ణబలి` అంటూ నరేష్‌ చెప్పడం నవ్వులు విరిసేలా చేసింది.

అనంతరం పూర్ణ మరో అడుగు ముందుకేసింది. నరేష్‌ని బాయ్‌ ఫ్రెండ్‌గా అంగీకరిస్తూనే తనకు తన బాయ్‌ ఫ్రెండ్‌ నరేష్‌తో స్టేజ్‌పై ఒక్క స్టెప్‌ డాన్సు చేయాలని ఉందని కోరింది. దానికి ఓకే చెప్పిన నరేష్‌... `ఉప్పెన`లోని `నీ కళ్లు నీలి సముద్రం.. ` పాటకి ఇద్దరు కలిసి రొమాంటిక్‌ స్టెప్పులేశారు. చివరికి నరేష్‌కి ముద్దు పెట్టినట్టుగా, ఆయన చెంపకొరికినట్టుగా పూర్ణ ఇచ్చిన పోజు మరింత హైలైట్‌ అవుతుంది. 

ఇదంతా `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమోలోని సన్నివేశాలు. ప్రోమోలోనే ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటే, ఇక పూర్తి ఎపిసోడ్‌లో ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎపిసోడో నరేష్‌ స్కిట్‌ హైలైట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. పూర్ణ, ఇంద్రజ జడ్జ్ లుగా ఉన్న `ఎక్స్ ట్రా జబర్దస్త్` షో ఈ రోజు రాత్రి ఈటీవీలో ప్రసారం కానుందనే విషయం తెలిసిందే. 
 

click me!