భర్త విజయ్ దేవరకొండకు స్టేజ్‌పైనే చెమట తుడిచి, మీసం సరిచేసి రష్మిక తన ప్రేమను చాటుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంట చేసిన మంచి పని కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.
సినిమా తెరపై హిట్టు పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జంటలు, నిజ జీవితంలోనూ ఒక్కటైతే ఆ కిక్కే వేరు. సరిగ్గా ఇలాగే, ఫిబ్రవరి 26న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ జంట పెళ్లి కాకముందు ఏదో రకంగా వైరల్ అయ్యారు.. ఇప్పుడు పెళ్లై మూడు నెలలు దాటినా.. ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గానే 40 స్కూల్స్ లో స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ లు ఇచ్చి అందరితో శభాష్ అనిపించుకున్నారు స్టార్ కపుల్.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
25
విజయ్ దేవరకొండ మీసం తిప్పిన రష్మిక..
ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఈ జంటకు సంబంధించిన ఒక క్యూట్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఈ వెంట్ లో స్టేజ్ పై భర్త విజయ్ దేవరకొండ ముఖానికి పట్టిన చెమటను రష్మిక ప్రేమగా తుడుస్తూ, ఆయన మీసం సరిచేస్తున్న వీడియో అభిమానుల మనసు దోచుకుంటోంది. ఈ కొత్త దంపతుల మధ్య ఉన్న అన్యోన్యతకు, ప్రేమకు ఈ వీడియో అద్దం పడుతోంది. అయితే ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు, దీని వెనుక ఓ పెద్ద బాధ్యత, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఒక కథ కూడా ఉంది.
35
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి కొన్ని రోజుల ముందు, విజయ్ తండ్రి స్వగ్రామమైన తెలంగాణలోని అచ్చంపేట మండలం, తుమ్మనపేట గ్రామంలోని కొంతమంది విద్యార్థులకు 'దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా సహాయం అందించారు. అప్పుడు అదే స్టేజ్ పై విజయ్, రష్మిక ఓ మాట ఇచ్చారు. 'భవిష్యత్తులో ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అర్హులైన విద్యార్థుల చదువుకు మా వంతు పూర్తి సహాయం అందిస్తాం' అని హామీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ స్టార్ కపుల్ తమ మాట నిలబెట్టుకున్నారు.
'ది దేవరకొండ ఫౌండేషన్' ద్వారా అచ్చంపేట మండలంలోని 9, 10వ తరగతి చదువుతున్న 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. విజయ్ దేవరకొండ తన (X) ఖాతాలో ఈ స్కాలర్ షిప్ అందుకున్న విద్యార్థుల లిస్ట్ ను షేర్ చేశారు. "ఈ స్కాలర్‌షిప్ చాలా చిన్నదే కావచ్చు, కానీ నా గ్రామంలో మొదలైన ఈ ప్రయత్నం రాబోయే రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించాలన్నది నా కల" అని విజయ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
55
వైరల్ అవుతున్న విజయ్ రష్మిక వీడియో..
అయితే ఇదే కార్యక్రమం మధ్యలో, మండుటెండకు విజయ్ దేవరకొండ ముఖంపై చెమటలు పడుతుండగా, భార్యగా రష్మిక వెంటనే స్పందించింది. అందరూ చూస్తుండగానే విజయ్ చెమటను తుడిచి, ఆయన మీసాన్ని ప్రేమగా సరిచేసింది. ఈ అందమైన క్షణం ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రీల్ లైఫ్‌లో సూపర్ హిట్ జోడీ అయిన వీళ్లు, రియల్ లైఫ్‌లోనూ బెస్ట్ కపుల్ అని మరోసారి నిరూపించుకున్నారు.