Ramu Rathod: అందరు నన్నే వాడుకుంటున్నారు.. రాము రాథోడ్‌ బోల్డ్ కామెంట్‌.. పేరెంట్స్ అన్నమాటకి ఎమోషనల్‌

Published : Jun 17, 2026, 09:10 AM IST

ఫోక్‌ సింగర్‌, రైటర్‌, డాన్సర్‌ రాము రాథోడ్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. ఇప్పుడు అంతా తనని వాడుకోవాలని చూస్తున్నారని వెల్లడించాడు. అదే సమయంలో వాళ్ల పేరెంట్స్ అన్న మాటకి ఎమోషనల్‌ అయ్యాడు. 

PREV
14
ఫోక్‌ స్టార్‌గా రాణిస్తోన్న రాము రాథోడ్‌

రాము రాథోడ్‌.. ఎలాంటి సినిమా బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు ఫోక్‌ స్టార్‌గా ఎదిగాడు. `రాను బొంబాయికి రాను` అనే ఒక్క పాటతో ఆయన స్టార్‌ అయిపోయాడు. ఈ పాట రాము రాథోడ్‌ జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు ఫోక్‌ సామ్రాజ్యానికి కింగ్‌ని చేసింది. వరుసగా ఓ వైపు ఫోక్‌ సాంగ్స్, మరోవైపు సినిమా పాటలతో ఆకట్టుకుంటున్నాడు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మరోసారి ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎమోషనల్‌ అయ్యాడు. ఇప్పుడు అంతా తనని వాడుకునేటోళ్లే ఉన్నారని చెబుతున్నాడు.

24
ఆఫీసుల చుట్టూ తిరిగే టైమ్‌ లేదు

రాము రాథోడ్‌.. చాలా రేర్‌గా పబ్లిక్‌ లోకి వస్తుంటాడు. తాజాగా ఆయన వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నాడు. అందులో భాగంగా తేజస్విని మదివాడ నిర్వహించిన ఒక టాక్‌ షోలో పాల్గొన్నాడు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బిగ్‌ బాస్‌ నుంచి ఎందుకు వెళ్లిపోయావని అడిగితే, అమ్మానాన్న గుర్తుకు వచ్చారని తెలిపాడు. వాళ్లని చాలా మిస్‌ అయినట్టు చెప్పాడు. అదే సమయంలో తనకు అవకాశాల కోసం ఆఫీస్‌ ల చుట్టూ తిరిగే టైమ్‌ లేదని, కొడితే సెలబ్రిటీ అయిపోవాలి, మీ వద్ద కూర్చునే స్థాయికి ఎదగాలి అని భావించినట్టు తెలిపాడు, అందుకే ఫోక్‌ సాంగ్‌లను ఎంచుకున్నట్టు వెల్లడించాడు.

34
పేరెంట్స్ అన్న మాటకి రాము రాథోడ్‌ ఎమోషనల్‌

ఈ క్రమంలో రాము రాథోడ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. తన పేరెంట్స్ గురించి చెబుతూ, తాము చాలా పేదరికం నుంచి వచ్చామని, నాన్న 200రూపాయల కూలీకి వెళ్లేవారట. అమ్మ యాభై రూపాయల కూలీకి వెళ్లేదట. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండేది కాదన్నాడు రాము రాథోడ్‌. అలాంటి పరిస్థితిని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్‌, హార్ట్ టచ్చింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ మధ్య వాళ్ల నాన్న నువ్వు మాకు దేవుడివిరా అని అన్నాడట. ఆ మాట తనని కదిలించిందని భావోద్వేగానికి గురయ్యాడు రాము రాథోడ్‌.

44
వాడికెంత బలుపు అని అంటున్నారని తెలిపిన రాము రాథోడ్‌

ఈ సందర్భంగా ఇంకో షాకింగ్‌ విషయాన్ని షేర్‌ చేసుకున్నాడు రాము రాథోడ్‌. తనకు ఇంతటి సక్సెస్‌ ఇచ్చిన సోసైటీనే ఈ రోజు దారుణంగా మాట్లాడుతుందని తెలిపాడు. తాను ఇప్పుడు ప్రాపర్‌గా ఒక షోలో కూర్చోలేకపోతున్నట్టు చెప్పాడు, వాడు చూడు, వాడికెంత బలుపు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందులో భాగంగానే `నిన్ను ఎవరైనా వాడుకుంటున్నారని మీకు అనిపించిందా ?` అనే తేజస్విని అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అంతా వాడుకుంటున్నారని వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి. రాము రాథోడ్‌ సెలబ్రిటీల గురించి చెబుతూ, సమంతకి హగ్‌ ఇస్తానని తెలిపారు. అలాగే తమన్నాకి సారీ చెబుతానని, ఆమె కంటే ముందు పుట్టనందుకు బాధపడుతున్నట్టు సరదాగా వెళ్లడించాడు. డిఎస్పీ మ్యూజిక్‌ అంటే ఇష్టమని వెల్లడించాడు. ప్రస్తుతం రాము రాథోడ్‌ కామెంట్స్ వైరల్‌గా మారాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories