
చాలా కాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం అయ్యింది. రూమర్డ్ లవర్స్ గా ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక సడెన్ గా నిశ్చితార్ధం చేసుకుని పెళ్లికి రెడీ అయ్యారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో, రహస్యంగా జరిగింది. ఇక వీరి పెళ్లి వచ్చే ఏడాది జరగబోతున్నట్టు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఇద్దరు సెలబ్రిటీలు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగు వెలుగుతున్నారు. అయితే కెరీర్ పరంగా రష్మిక బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతుంటే.. విజయ్ దేవరకొండ మాత్రం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన తరువాత టాలీవుడ్ లో బిజీ అయిపోయింది రష్మిక. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి గీత గోవిందం సినిమాతో బ్రేక్ వచ్చింది. మరో వైపు జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాలో హీరోగా నిలబడగా, గీత గోవిందం సినిమా విజయ్ కు బ్రేక్ ఇచ్చింది. ఈ హిట్ సినిమాతోనే ఈ ఇద్దరు తారల బంధం బలపడింది. గీత గోవిందం సినిమాతో స్టార్ట్ అయిన స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగామారిపోయింది. డియర్ కామ్రేడ్ సినిమా నుంచి వీరి రిలేషన్ పై వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ ఇద్దరు స్టార్స్ గురించి చర్చ జరుగుతూనే ఉంది.
టాలీవుడ్ లో రష్మికకు బాగా కలిసొచ్చింది. టాలీవుడ్ నుంచే ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలుతోంది. మధ్యలో ఒకటీ అరా సినిమాలు తప్పించి రష్మిక కెరీర్ లో అన్నీ హిట్ సినిమాలే. గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ తరువాత విజయ్ కాంబినేషన్ లో చేసిన డియార్ కామ్రేడ్ డిజాస్టర్ అయ్యింది. కెరీర్ బిగినింగ్ లోనే స్టార్ హీరోల సరసన ఆఫర్లు వచ్చాయి రష్మికకు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈసినిమా తరువాత రష్మిక కెరీర్ స్పీడ్ అందుకుంది. అటు పెద్ద హీరోలతో నటిస్తూనే నితిన్ తో భీష్మ, శర్వానంద్ తో ఆడాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాల్లో నటించింది రష్మిక మందన్న.
రష్మిక ఫిల్మ్ కెరీర్ ను కంప్లీట్ గా టర్న్ చేసిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ జంటగా శ్రీవల్లి పాత్రలో రష్మిక యాక్టింగ్ కు జాతీయ స్థాయిలో ఆడియన్స్ ఫిదా అయ్యారు. పుష్ప ఫస్ట్ పార్ట్ మూవీ కంటే కూడా పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉండటం, ఈసినిమాతో అల్లు అర్జున్ కు ఎంత పేరు వచ్చిందో రష్మికకు కూడా అంతే పేరు వచ్చింది. ఈలోపు బాలీవుడ్ సినిమాలతో రష్మిక నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటు సౌత్ , అటు బాలీవుడ్ రెండు ఇండస్ట్రీలను రెండు కళ్లుమాదిరి మెయింటేన్ చేసుకుంటూ వస్తోంది బ్యూటీ. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతోంది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది రష్మిక. సౌత్ లో పుష్ప2 సినిమాతో దాదాపు 1900 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసిన రష్మిక, బాలీవుడ్ లో ఛావ సినిమాలో 800 కోట్లు కొల్లగొట్టింది. మరోవైపు రణ్ బీర్ కపూర్ జంటగా ఆమె నటించిన యానిమల్ సినిమా ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించడంతో పాటు, 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక, ఇటు సౌత్ లో మరోసారి అల్లు అర్జున్ తో జోడీ కట్టబోతోంది. అట్లీడబ తో అల్లు అర్జున్ చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీలో నటిస్తోంది రష్మిక. అల్లు అర్జున్ తో పుష్ప3 లో కూడా నటించాల్సి ఉంది. కెరీర్ లో ఇలా బిజీగా ఉన్న టైమ్ లోనే రష్మిక పెళ్లి చేసుకోబోతోంది. నెక్ట్స్ ఇయర్ వరకు తన సినిమాలు కంప్లీట్ చేసి పెళ్లాడుతుందా? లేక ముందుగానే విజయ్ తో మూడు ముళ్లు వేయించుకుంటుందా అనేది చూడాలి.
రష్మిక హిట్టు మీద హిట్లు కొడుతుంటే.. విజయ్ మాత్రం వరుస ప్లాప్ లతో ఇబ్బందిపడుతున్నాడు. విజయ్ దేవరకొండ వెంట వెంటనే పరాజయాలు ఎదురవ్వడంతో సతమతమవుతున్నాడు. ఎన్ని డిజాస్టర్లు ఎదురైనా రౌడీ హీర క్రేజ్ మాత్రం తగ్గడంలేదు. ప్లాప్ లతో ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా.. గతంలో మాదిరి విజయ్ పేరు ఇండస్ట్రీలో పెద్దగా వినిపించడంలేదు. కానీ విజయ్ ఫ్యాన్స మాత్రం ఆయన్ను అంటిపెట్టుకునే ఉన్నారు. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ రౌడీ హీరోకు ఎక్కువగా ఉంది.
ఒక రకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండకు గీత గోవిందం తరువాత ఆ రేంజ్ హిట్ రాలేదనే చెప్పాలి. ఈమధ్యలో ఆయన మాస్ ఇమేజ్ ను కంటీన్యూ చేయాలని చాలా ట్రై చేశాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ లైన్ మార్చి, గీత గోవందం లాంటి సినిమాలు చేసినా అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. పాన్ ఇండియా హీరోగా దుమ్మురేపాలని ట్రై చేసిన విజయ్ దేవరకొండకు లైగర్ సినిమాతో భారీ నిరాశ ఎదురయ్యింది. ఈ మూవీతో గట్టి దెబ్బ తగిలించి విజయ్ కు గీత గోవిందం తరువాత టాక్సీవాల, ఖుషీ లాంటి ఒకటి రెండు సినిమాలు మాత్రమే విజయ్ కు కాస్త ఊరటను ఇచ్చాయి. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన లైగర్ , కింగ్డమ్ లాంటి సినిమాలు డిజాస్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి. రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ పై రౌడీ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా ఆయన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది.
దాదాపు ఏడేళ్లుగా విజయ్ దేవరకొండ, రష్మికమందన్న ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతకాలంగా వారు ప్రేమ విషయం వెళ్లడించలేదు, పెళ్లి కూడా చేసుకోలేదు. విజయ్ దేవరకొండ ఫెయిల్యూర్స్ నుంచి బయటపడి సాలిడ్ హిట్ కొట్టిన తరువాత పెళ్లి చేసుకుంటాడేమో అని ఫ్యాన్స్ లో చర్చలు జరిగాయి. కానీ ఇన్నాళ్ల నుంచి వీరిద్దరిపై వస్తున్న వార్తలు, సోషల్ మీడియా గాసిప్స్, ఎక్కడికి వెళ్లినా వారి పెళ్లి ప్రస్తావన తీసుకువస్తుండటం, ఈ ఇద్దరు స్టార్స్ ను ఇబ్బదిపెడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ ఇద్దరు సెలబ్రిటీలు పెళ్లికి రెడీ అయినట్టు సమాచారం. 2026 లో విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈలోపు విజయ్ సాలిడ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి. విజయ్ కు ఇలానే వరుసగా ప్లాప్ లు పడితే ఆయన కెరీర్ డేంజర్ లో పడుతుందేమో అన్న భయంలో ఉన్నారు రౌడీ ఫ్యాన్స్.