2000 కోట్ల సినిమా చేసినా సమంతని టచ్ చేయలేకపోయిన రష్మిక, ఇండియా మోస్ట్ పాపులర్‌ హీరోయిన్ల లిస్ట్

సినిమా రంగంలో హీరోహీరోయిన్ల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. ఎవరు టాప్‌ అనే చర్చ నడుస్తూనే ఉంటుంది. సక్సెస్‌ని బట్టి, చేసే సినిమాలని బట్టి ఈ లెక్కలు మారిపోతుంటాయి. హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగానే వినిపిస్తుంది. కొంత కాలం ఓ హీరోయిన్‌ టాప్‌లో ఉంటే, మరికొంత కాలం మరో హీరోయిన్‌ టాప్‌ గేమ్‌లో నిలుస్తుంది. ఇది ఎప్పుడూ ఒక సర్కస్‌ లాగే నడుస్తుంది. కొంత కాలం కొందరు హీరోయిన్లు రూల్‌ చేస్తారు. కానీ ఆడియెన్స్ దృష్టిలో టాప్‌ హీరోయిన్లు వేరే ఉంటారు. మరి మార్చి నెలలో టాప్‌లో ఉన్న హీరోయిన్లు ఎవరో చూద్దాం. 

rashmika not beat Samantha even she done 2000 crore movie india top 10 populer heroines list in telugu arj
samantha, rashmika, nayanthara

ఇక రెండో స్థానంలో బాలీవుడ్‌ హీరోయిన్లు నిలిచారు. అలియాభట్‌ రెండో స్థానం దక్కించుకుంది. ఆమె బాలీవుడ్‌లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. సినిమాల పరంగానూ అలరిస్తూనే ఉంది. అలాగే మూడో స్థానం దీపికా పదుకొనె దక్కించుకుంది.

ఈ టాప్‌ 3 స్థానాలు గత మూడు నాలుగు నెలలుగా వీరే సొంతం చేసుకోవడం విశేషం. అలియాభట్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో, దీపికా పదుకొనె `కల్కి 2898 ఏడీ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన విషయం తెలిసిందే. 
 

samantha

గత రెండు మూడు నెలలుగా హీరోయిన్లలో టాప్‌లో సమంత నిలుస్తూ వస్తుంది. అలాగే మార్చి నెలలో కూడా సమంత నెంబర్‌ 1గా నిలవడం విశేషం. ఆమెకి సినిమాలు లేవు. పెద్దగా బయట యాక్టివ్‌గానూ కనిపించలేదు. అయినా టాప్‌ లో నిలవడం విశేషం.

సోషల్‌ మీడియాలో ఆమె చుట్టూ కథనాలు రావడం, ఆమె ఫ్యాన్స్ హడావుడి చేయడంతో సమంత నిత్యం సోషల్‌ మీడియాలో నిలుస్తూ వచ్చింది. ఆమె కష్టాలు కూడా ఎక్కువగా అభిమానించే తారగా సమంతని నిలపడం విశేషం. అదే ఆమెని టాప్‌లో నిలిచింది.


Deepika Padukone

ఇక రెండో స్థానంలో బాలీవుడ్‌ హీరోయిన్లు నిలిచారు. అలియాభట్‌ రెండో స్థానం దక్కించుకుంది. ఆమె బాలీవుడ్‌లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. సినిమాల పరంగానూ అలరిస్తూనే ఉంది. అలాగే మూడో స్థానం దీపికా పదుకొనె దక్కించుకుంది.

ఈ టాప్‌ 3 స్థానాలు గత మూడు నాలుగు నెలలుగా వీరే సొంతం చేసుకోవడం విశేషం. అలియాభట్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో, దీపికా పదుకొనె `కల్కి 2898 ఏడీ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన విషయం తెలిసిందే. 

kajal

ఇక నాల్గో స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ నిలిచింది. కాజల్‌కి కూడా సినిమాలు లేవు. కానీ యాడ్స్ రూపంలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది. ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంది. ఆమెకి కూడా ఫ్యాన్‌ బేస్‌ గట్టిగా ఉంది. దీని కారణంగా కాజల్‌ టాప్‌లో నిలుస్తుందని చెప్పొచ్చు. 
 

rashmika mandanna

ఇక ఐదో స్థానంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నిలిచింది. ఆమె గతేడాది `పుష్ప 2`తో సుమారు రెండు వేల కోట్ల మూవీలో భాగమైంది. ఆమె దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌ అయ్యింది. దీంతోపాటు ఈ ఏడాది `ఛావా` మూవీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆమె స్థానం అక్కడికే పరిమితమవుతూ వస్తుంది.

ఆమె టాప్‌ 1లోకి రాలేకపోయింది. దీంతో నెటిజన్లు 2000 వేల కోట్ల మూవీ చేసినా సమంతని రష్మిక టచ్‌ చేయలేకపోతుందని కామెంట్‌ చేస్తుండటం గమనార్హం. రష్మిక ఇటీవల నటించిన సల్మాన్‌ తో `సికందర్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ ఇది డిజాప్పాయింట్‌ చేయింది. 

sai pallavi

ఆరో స్థానంలో తెలుగు హీరోయిన్‌ సాయిపల్లవి నిలవడం విశేషం. ఆమె ఇటీవల `అమరన్‌`, `తండేల్` చిత్రాలతో అలరించింది. వెంట వెంటనే రెండు విజయాలు అందుకుంది. అలా ఆమె టాప్‌లోకి వచ్చింది. ఇక ఏడో స్థానంలో త్రిష నిలిచింది.

త్రిష ఈ మధ్య వెంట వెంటనే `పట్టుదల`, `గుడ్ బ్యాడ్‌ అగ్లీ` చిత్రాల్లో నటించింది. చాలా రకాలుగా త్రిష చుట్టూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఇండియా మోస్ట్ పాపులర్‌ హీరోయిన్‌గా నిలిచింది. 
 

Nayanthara

ఎనిమిదో స్థానంలో సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నిలిచింది. ఆమె వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చింది. కోలీవుడ్‌లో ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. అలా ఎనిమిదో స్థానంలో నిలిచింది నయనతార.

తొమ్మిదో స్థానం అనుష్క శెట్టి సొంతం చేసుకుంది. ఇక పదో స్థానంలో కత్రీనా కైఫ్‌ నిలవడ విశేషం. ఇలా ఈ నటీమణులు టాప్‌ 10 లిస్ట్ లో సొంతం చేసుకున్నారు. 

read  more: సమంత ప్రియుడు రాజ్ నిడిమోరు గురించి ఈ విషయాలు తెలుసా? తిరుపతితో ఆయనకు లింకేంటంటే?

also read: ఆ మణిరత్నం సినిమా ఇప్పుడు వస్తే థియేటర్లు తగలబడిపోతాయి.. సినిమాటోగ్రాఫర్‌ సంచలన కామెంట్స్

Latest Videos

vuukle one pixel image
click me!