విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లికి మరో ఐదు రోజులే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు కాబోయే అత్తతో రష్మిక దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. వీరి రహస్యం బయటకు వచ్చింది.
రష్మిక మందన్నా త్వరలో పెళ్లిపీఠలెక్కబోతుంది. విజయ్ దేవరకొండని ఆమె మ్యారేజ్ చేసుకోబోతుంది. మరో ఐదు రోజుల్లో వీరి వివాహం జరగబోతుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వివాహం జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈనెల 26న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఉదయ్ పూర్‌కి చేరుకున్నట్టు సమాచారం. ఇటీవల వీరు ఎయిర్ పోర్ట్ లో మెరిసిన విషయం తెలిసిందే.
25
మార్చి 4న విజయ్, రష్మిక రిసెప్షన్
గురువారం మ్యారేజ్ జరుగుతుండగా, ఐదు రోజుల పెళ్లి తరహాలో తమ వివాహాన్ని ప్లాన్ చేసుకున్నారట. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్, హల్దీ వేడుక, మ్యారేజ్ ఇలా వరుసగా ప్లాన్ చేసుకున్నారట. అయితే ఈ పెళ్లికి అతికొద్ది మంది బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానించారు విజయ్, రష్మిక. ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, మిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు మాత్రమే హాజరయ్యే ఛాన్స్ ఉంది. అయితే మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ప్లాన్ చేశారు. దానికి ఇండస్ట్రీ వర్గాలు, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు హాజరు కానున్నారు. తాజ్ కృష్ణలో ఈ రిసెప్షన్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
35
గీత గోవిందం, డియర్ కామ్రేడ్‌లో కలిసి నటించిన రష్మిక, విజయ్ దేవరకొండ
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. `గీత గోవిందం` టైమ్‌లో స్నేహం ఏర్పడింది. `డియర్ కామ్రేడ్` టైమ్ లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమని కంటిన్యూ చేశారు. దాదాపు ఏడేళ్ల ప్రేమ అనంతరం ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇదిలా ఉంటే తమ ప్రేమ విషయాన్ని వీరిద్దరు రహస్యంగానే ఉంచారు. కాకపోతే హింట్ ఇస్తూ వచ్చారు. విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక రావడం, వీరిద్దరు కలిసి వెకేషన్ కి వెళ్లడం అన్నీ నెటిజన్లు పట్టుకున్నారు.
అయితే ఇన్నాళ్లకు ఆ రహస్యం బయటకు వచ్చింది. ఇప్పుడు స్వయంగా రష్మిక మందన్నా తనకు కాబోయే అత్తతో దిగిన ఫోటోలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక విజయ్ ఇంటికి వెళ్తుండేది అనే టాక్ నడిచింది. దాన్ని నిజం చేశారు. విజయ్ దేవరకొండ అమ్మతో రష్మిక దిగిన ఫోటోలు బయటకు రావడంతో రష్మిక రహస్యంగా చాలా కథ నడిపించిందని అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ అమ్మ మాధవి, రష్మిక ఎంతో క్లోజ్‌గా ఉన్నారు. వీరిద్దరు సరదాగా నవ్వుకున్నారు. బాగా కలిసిపోయారు. వీరి మధ్య చాలా కాలంగా మంచి బాండింగ్ ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది.
55
కాబోయే అత్తతో రష్మిక మందన్నా రచ్చ
ఈ ఫోటోలను బట్టి చూస్తే, వీరంతా కలిసి పార్టీలకు వెళ్లారు, ఇంట్లో సందడి చేశారు. వెకేషన్‌కి కూడా వెళ్లారు. ఇంట్లో సరదాగా టైమ్ స్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఫోటోస్‌లో ఆనంద్ దేవరకొండ కూడా కనిపించడం విశేషం. మొత్తంగా చాలా రోజుల నుంచే అత్తా కోడళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారని చెప్పొచ్చు. అదే సమయంలో రష్మిక మందన్నా చాలా కాలం నుంచే విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో భాగమైపోయిందని చెప్పొచ్చు.