Karthika Deepam 2 Today Episode: ఒట్టుతో తండ్రిని ఆపిన దీప- జ్యో టెన్షన్-జ్యోని ఇల్లు దాటనివ్వని తాత

Published : Feb 21, 2026, 08:28 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 21వ తేదీ)లో నిజం చెప్తే తనపై ఒట్టేనని తండ్రిని ఆపుతుంది దీప. ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతుంది జ్యో. పారు, జ్యోలను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఆపుతాడు శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే  

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నన్ను భయపెడుతున్నావు అంటుంది పారు. నేనే నీ మనుమరాలిని అని త్వరలోనే నువ్వు నమ్ముతావు. కానీ ఈలోపే ఈ ఆట ముగుస్తుంది. నువ్వు మళ్లీ పాత బట్టల మూటతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందే గ్రానీ. అలా జరగకూడదు అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అంటుంది జ్యోత్స్న. ఏం చేయాలో చెప్పు అంటుంది పారు. దాసు, బావను కలవకూడదు, దాసు ఎక్కడికి వెళ్లాడో తెలుసుకోవాలి అంటుంది.

28
జ్యో టెన్షన్..

ఒక్క నిమిషం ఆగు అని… పారు కాంచనకు ఫోన్ చేసి కార్తీక్, దీప ఇంకా ఇంటికి రాలేదు. అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది. వాళ్లిద్దరూ గుడికి వెళ్లారు వస్తారులే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కాంచన. అంటే దాసు కార్తీక్ ని గుడిలో కలుస్తాడా? దశరథ కూడా ఇంట్లో లేడు. అంటే వీళ్లందరూ గుడిలో కలిసి మాట్లాడుకుంటున్నారా అని పారు అనడంతో, జ్యోత్స్న టెన్షన్ తో కూలబడిపోతుంది.

38
ఒట్టు వేయించుకున్న దీప

మరోవైపు నిజం ఎవరికి చెప్పొద్దు అని దశరథను కన్విన్స్ చేయడానికి దీప, కార్తీక్, దాసు ప్రయత్నిస్తుంటారు. నా కూతురు ఇక కష్టాలు పడ్డానికి వీల్లేదు. నేను అందరితో నిజం చెప్పేస్తాను అంటాడు దశరథ. వద్దు మామయ్య. నువ్వు అత్త గురించి కూడా ఆలోచించు. జ్యోత్స్న తన కూతురు కాదని తెలిస్తే అత్త ఏమవుతుంది. తన ఆరోగ్యం ఇప్పటికే బాలేదు అని రిక్వెస్ట్ చేస్తాడు కార్తీక్. 

అయినా దశరథ వినకపోవడంతో నిజం చెప్తే తాను చచ్చినంత ఒట్టే అని తనపై ఒట్టు వేసుకొని తండ్రిని కట్టిపడేస్తుంది దీప. ఈ నిజం తాను చెప్పేవరకు ఎవరికి చెప్పొద్దు అని మాట తీసుకుంటుంది. ఎందుకమ్మా ఒట్టు వేసి నన్ను బలహీనున్ని చేస్తున్నావు అని కాసేపు ఎమోషనల్ అవుతాడు దశరథ. నిజం తెలిస్తే వదిన తట్టుకోలేదు అన్నయ్య అంటాడు దాసు. నువ్వు మాట్లాడకురా.. నువ్వు, మీ అమ్మ తిన్నింటి వాసాలు లెక్కపెడతారు. ఇన్నేళ్లు నా బిడ్డను నాకు కాకుండా చేశారు. నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది అంటాడు దశరథ.

48
చావు అంచులదాక..

కార్తీక్ కలగజేసుకొని దాసు మామయ్యను అలా అనకు మామయ్య. పారిజాతం నీకే కాదు దాసు మామయ్యకు కూడా అన్యాయమే చేసింది. తన కూతురిని తనకు కాకుండా చేసింది. పైగా అవన్నీ తనకు చెప్పి చేయలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ నిజాన్ని మోయలేక, దీప ఎక్కడుందో తెలియక తను బాధపడ్డాడు. చివరికి కుబేర్ గారి ఫోటో చూసి అసలు నిజం తెలుసుకున్నాడు. అందరికి చెప్తామని ప్రయత్నించి జ్యోత్స్న చేతిలో చావు అంచులదాక పోయివచ్చాడు. చివరికి నిజం నాతో చెప్పాడు. నేను ఎవరికి చెప్పొద్దు అన్నాను. ఇప్పుడు కూడా జ్యోత్స్న తనని కిడ్నాప్ చేస్తే తప్పించుకొని వచ్చాడు అని చెప్తాడు కార్తీక్.

58
దాసును దగ్గరికి తీసుకున్న దశరథ

జ్యోత్స్న కిడ్నాప్ చేసిందా అని షాక్ అవుతాడు దశరథ. దాసు దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అన్నయ్య. నేను నీకు లక్ష్మణుడినో కాదో నాకు తెలియదు. కానీ, నువ్వు మాత్రం నాకు రాముడివే అన్నయ్య. నన్ను దూరం చేయకు అంటాడు. ఏదో కోపంలో నోరుజారాను. పట్టించుకోకురా అని దాసును దగ్గరికి తీసుకుంటాడు దశరథ. మొత్తానికి అనుకున్నది సాధించావురా అల్లుడు అంటాడు దాసు. ఇప్పుడే అసలు కథ మొదలైంది మామయ్య అంటాడు కార్తీక్. సరే గుడిలోకి వెళ్లి దండం పెట్టుకుందాం పదండి అంటాడు దశరథ.

68
అందుకే ఏం అనట్లేదు

మరోవైపు శివన్నారాయణ, శ్రీధర్ ఆఫీసు విషయాల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటారు. నువ్వు కాశీని క్షమించినట్లు నీ కూతురు కూడా క్షమిస్తే బాగుండు అంటాడు శివన్నారాయణ. ఇష్టపడ్డాను అని నాకు నచ్చకపోయిన కాశీని పెళ్లిచేసుకుంది. ఇప్పుడు వద్దు అంటోంది. తనే మారుతుంది. కానీ కాస్త టైం పడుతుంది అంటాడు శ్రీధర్. నేను ఏదైనా మాట అంటే పంతం కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడదు. అందుకే ఏం అనట్లేదు మామయ్య అని చెప్తాడు శ్రీధర్. వీళ్లను దూరంగా ఉండి గమనిస్తూ ఉంటుంది జ్యోత్స్న. పారు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. బయటకు వెళ్లాలి అంటుంది జ్యోత్స్న. పదా అని బయల్దేరుతారు.

78
ఇంట్లోనే జ్యో, పారు

పారిజాతం ఎక్కడికి వెళ్తున్నారు అని ఆపుతాడు శివన్నారాయణ. జ్యోత్స్నకి కొంచెం షాపింగ్ ఉందంటా వెళ్లొస్తామండి అని చెప్తుంది పారు. వద్దు, దశరథ వచ్చే వరకు మీరు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్నను ఎక్కడికి పంపించొద్దు అని దశరథ చెప్పాడు. ఇక మీరు లోపలికి వెళ్లండి అంటాడు. పారు ఏదో చెప్పబోతే.. కావాలంటే నువ్వు వెళ్లు అంటాడు శివన్నారాయణ.

88
దశరథ సంతోషం

మరోవైపు కార్తీక్, దీప పేర్లపై అర్చన చేయిస్తాడు దశరథ. నా కూతురు కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలని కూడా అర్చన చేయండి పంతులు గారు అని చెప్తాడు. అది విన్న దీప, కార్తీక్ ని పిలిచి మా నాన్న నా బిడ్డ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ బిడ్డను నేను వదులుకోబోతున్నానని తెలిస్తే ఎంత బాధపడతాడో అంటుంది దీప. ఇప్పుడే నిజం చెప్పేద్దాం అంటాడు కార్తీక్. వద్దు బావ అని ఆపుతుంది దీప.

ఇక నేను వెళ్లొస్తా అన్నయ్య అంటాడు దాసు. జాగ్రత్త చెప్తాడు దశరథ. నీకు నిజం తెలిసింది కదా అన్నయ్య. ఇక నాకు ఏమైనా పర్లేదు అంటాడు దాసు. అలా అనకురా అందరు బాగుండాలి అంటాడు దశరథ. దీపను పిలిచి పదమ్మా మన ఇంటికి వెళ్దాం అంటాడు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories