Prabhas Favorite Director: ప్రభాస్‌కి ఇష్టమైన సినిమా ఇదే, యాక్షన్‌ లవర్స్ కి షాక్‌.. పూరీని మించినోడు లేడు

Published : Feb 21, 2026, 08:51 AM IST

ప్రభాస్‌ యాక్షన్‌ సినిమాలతో రాణిస్తున్నారు. కానీ ఆయనకు ఇష్టమైన జోనర్‌ యాక్షన్‌ కాదట. అదేంటో వెల్లడించారు. తాను చేసిన సినిమాల్లో ఇష్టమైన మూవీని కూడా రివీల్‌ చేశారు. 

PREV
15
ఇండియా బిగ్గెస్ట్ స్టార్ గా రాణిస్తున్న ప్రభాస్‌

ప్రభాస్‌ ప్రస్తుతం ఇండియాలో తిరుగులేని పాన్‌ ఇండియా హీరో. అదే సమయంలో బిగ్గెస్ట్ స్టార్‌ కూడా. ఆయన పేరుపై దాదాపు ఆరేడు వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఆయన ఒక్క మూవీ చేస్తే దానిపై ఏకంగా వెయ్యి కోట్లకుపైగానే బిజినెస్‌ నడుస్తుంది. అంతేకాదు ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఆయన రేంజ్‌ని, మార్కెట్‌ని మరింతగా పెంచబోతున్నాయి. యాక్షన్‌, మైథాలజీ, ఫిక్షన్‌ చిత్రాలతో అలరించేందుకు వస్తున్నారు డార్లింగ్‌.

25
యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ ప్రభాస్‌

ఇటీవల కాలంలో వరుసగా యాక్షన్‌ సినిమాలు చేశారు ప్రభాస్‌. దాన్నుంచి రిలీఫ్‌ కోసం ఈ సంక్రాంతికి రొమాంటిక్‌ కామెడీ `ది రాజాసాబ్‌` చేశారు. ఇది ఆడలేదు. ఇప్పుడు సందీప్‌ రెడ్డిది యాక్షన్‌ మూవీనే, `ఫౌజీ` యాక్షన్‌ లవ్‌ స్టోరీ. చేయబోయే `కల్కి 2`, `సలార్‌ 2`లు కూడా యాక్షన్‌ చిత్రాలే. ఆయన్ని అభిమానులు కూడా యాక్షన్‌ హీరోగా చూస్తున్నారు. ప్రభాస్‌ ఆయుధం పట్టుకుని నిలబడితే చాలు థియేటర్లు ఊగిపోతున్నాయి. అభిమానులకు పూనకాలే అని చెప్పొచ్చు. మరి యాక్షన్‌ హీరోగా పాపులర్‌ అయిన ప్రభాస్‌కి ఇష్టమైన జోనర్‌ ఏంటి? ఆయనకు ఇష్టమైన దర్శకుడు ఎవరనేది చూస్తే.

35
ప్రభాస్‌కి ఇష్టమైన దర్శకుడు, ఇష్టమైన మూవీ

ప్రభాస్‌ ఆ విషయాలను బయటపెట్టారు. తనకు ఇష్టమైన దర్శకుడు మణిరత్నం అని తెలిపారు. తనకు ఇష్టమైన జోనర్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్‌ అని వెల్లడించారు. తన మనసులో మాటని బయటపెట్టారు. మణిరత్నం రూపొందించిన `గీతాంజలి` అంటే  బాగా ఇష్టమని వెల్లడించారు. అది తన ఫేవరేట్‌ అని చెప్పారు ప్రభాస్‌. `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ టీమ్‌తో చేసిన చిట్‌ చాట్‌లో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఈ మూవీలో సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించగా, అశ్విన్‌ చంద్రశేఖర్‌ రూపొందించారు. వీరంతా ప్రభాస్‌తో ఛాటింగ్‌లో పాల్గొన్నారు. 

45
పూరీ జగన్నాథ్‌ లాంటి దర్శకుడు మరొకరు లేరు

తన సినిమాల్లో `ఏక్‌ నిరంజన్‌` తనకు ఇష్టమైన మూవీ అని తెలిపారు డార్లింగ్‌. పూరీ జగన్నాథ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. పూరిగారిలా హీరో క్యారెక్టర్‌ రాయగల దర్శకుడు ఇండియాలోనే లేడు. నా కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్‌ బుజ్జిగాడు. ఆ పాత్ర వినగానే ఎలా చేయాలని భయపడ్డాను. ఏక్‌ నిరంజన్‌ కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక హీరో పాత్రని పూరిలా రాసే దర్శకుడు మరొకరు లేరు` అని స్పష్టం చేశారు ప్రభాస్‌. పూరీజగన్నాథ్‌ని ఆకాశానికి ఎత్తేశాడు. కానీ పూరి మాత్రం ఇటీవల విఫలమవుతున్న విషయం తెలిసిందే.

55
ప్రభాస్‌ సినిమాలు

ఇక ప్రస్తుతం ప్రభాస్‌.. హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రం చేస్తున్నారు. వార్‌ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ. ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించబోతున్నారు. ఇమాన్వి హీరోయిన్‌. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.  దీంతోపాటు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` చేస్తున్నారు. డిమ్రి తృప్తి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది యాక్షన్‌ మూవీ. ఇటీవల కొంత భాగం ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఇందులో బిగ్‌ స్టార్స్ మెరవబోతున్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories