ఎన్టీఆర్‌ విషయంలో కోరిక నెరవేర్చుకుంటున్న రష్మిక మందన్నా.. అప్పుడు చెప్పింది, ఇప్పుడు అదే జరుగుతుంది?

Published : Jun 24, 2024, 08:10 PM IST

ఎన్టీఆర్‌ విషయంలో తన డిజైర్‌ని వెల్లడించింది రష్మిక మందన్నా. ఆయన డాన్స్ పై ప్రశంసలు కురిపించింది. కానీ ఇకపై మాత్రం దాన్ని ప్రత్యక్షంగా చూడబోతుందట.   

PREV
16
ఎన్టీఆర్‌ విషయంలో కోరిక నెరవేర్చుకుంటున్న రష్మిక మందన్నా.. అప్పుడు చెప్పింది, ఇప్పుడు అదే జరుగుతుంది?

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటుంది. తన ఎంజాయ్‌ చేస్తుంది, ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. తాజాగా ఆమె తన సొంతూరు విశేషాలను తెలియజేసింది. అక్కడి ట్రెడిషన్‌ లుక్‌లో మెరిసింది. 
 

26

`నా హృదయం, నా చరిత్ర ఉన్న ప్రదేశం కొడగు. నేను నా అమ్మాయిలు(ఫ్రెండ్స్) పెరిగిన ప్రదేశం ఇది. దేవుడా నా ఇంటిని ఎలా మిస్‌ అవుతున్నాను` అంటూ పోస్ట్ పెట్టింది రష్మిక మందన్నా. ఇందులో ఆమె స్థానిక ట్రెడిషన్‌లో కనిపించడం విశేషం. చీరని వెరైటీగా కట్టి ఆకట్టుకుంటుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది రష్మిక. ఇందులో ఆమె ఎంతో క్యూట్‌గా ఉంది. 
 

36

ఇదిలా ఉంటే రష్మిక మందన్నా ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులోనే కాదు, ఇండియా వైడ్‌గా అంతా వెయిట్‌ చేస్తున్న `పుష్ప 2`లో నటిస్తుంది. శ్రీవల్లిగా మరోసారి సందడి చేయడానికి రాబోతుంది. దీంతోపాటు `ది గర్ల్ ఫ్రెండ్‌`, `రెయిన్‌బో` చిత్రాల్లో నటిస్తుంది. `కుబేర`లో ధనుష్‌తో జోడీ కడుతుంది. అలాగే బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి `సికందర్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇలా ప్రతిష్టాత్మక మూవీస్‌లో రష్మిక భాగం కావడం విశేషం. 

46

ఇదిలా ఉంటే ఈ నేషనల్‌ క్రష్‌ మరో సంచలన మూవీలో భాగం కాబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్‌తో మొదటిసారి జోడీ కడుతుందని అంటున్నారు. తారక్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఆగస్ట్ లో ఇది ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నాని ఫైనల్‌ చేశారని తెలుస్తుంది. సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న నేపథ్యంలో రష్మిక క్రేజ్‌ ఉపయోగపడుతుందని ప్రశాంత్‌ నీల్‌ ఆమెకి ఓకే చేశారని తెలుస్తుంది. రష్మిక మందన్నా కూడా ఓకే చెప్పిందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇందులో బాబీ డియోల్‌ కూడా నటిస్తారని సమాచారం. 
 

56

ఇదిలా ఉంటే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ గురించి మాట్లాడింది రష్మిక మందన్నా. ఆయనపై తన అభిమానాన్ని వెల్లడించింది. ఎన్టీఆర్‌ డాన్సులంటే తనకు చాలా ఇష్టమని, వాహ్‌ ఎంత బాగా చేస్తాడో అని చెప్పింది. ఆయన డాన్సింగ్‌ స్కిల్స్ అద్బుతం అని, ఆయన్ని తాను ఎప్పుడూ కలవలేదని, కానీ ఆయన డాన్స్ కి రిహార్సల్స్ లేకుండా చేస్తారని విన్నాను. అది ఎలా సాధ్యమని తెలుసుకోవాలని ఉంది. ఈ సందర్బంగా తారక్‌తో పనిచేయాలనే ఆసక్తిని వెల్లడించింది రష్మిక మందన్నా. ఇప్పుడు ఏకంగా ఆయనతోనే కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇదే నిజమైతే ఓ రకంగా రష్మిక కోరిక నెరవేరబోవడంతోపాటు ఇదొక క్రేజీ ప్రాజెక్ట్ కాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

66
NTR

ఎన్టీఆర్‌ ఇప్పుడు `దేవర` సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఇది థాయిలాండ్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌లపై ఓ పాటని చిత్రీకరిస్తున్నారట. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్‌ 27న విడుదల కాబోతుంది. అలాగే ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories