తొడకొడితే ట్రైన్‌ వెనక్కి వెళ్లడమేంటి? మరీ సిల్లీ కాకపోతే.. నేనెలా ఒప్పుకున్నా.. తనపైనే బాలయ్య షాకింగ్‌ సెటైర్

Published : Jun 24, 2024, 02:55 PM IST

బాలకృష్ణకి టాలీవుడ్‌లో లార్జర్‌ దెన్‌ లైఫ్‌ ఇమేజ్‌ ఉంది. ఆయన సినిమాల్లో యాక్షన వేరే లెవల్లో ఉంటుంది. దీనిపై బాలయ్య స్పందించారు. తనపైనే సెంటైర్లు వేసుకున్నారు.  

PREV
17
తొడకొడితే ట్రైన్‌ వెనక్కి వెళ్లడమేంటి? మరీ సిల్లీ కాకపోతే.. నేనెలా ఒప్పుకున్నా.. తనపైనే బాలయ్య షాకింగ్‌ సెటైర్
Balakrishna

 బాలకృష్ణకి లార్జర్‌ దెన్‌ లైఫ్‌ ఇమేజ్‌ ఉన్న ఏకైక తెలుగు హీరో. ఆయన చేసే ఫైట్లని ఆడియెన్స్ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తొడకొట్టితే, ట్రైన్‌ వెనక్కి వెల్లడం, చైర్లు దగ్గరకు రావడం, విలన్లకి హార్ట్ ఎటాక్‌ రావడం ఆయన సినిమాల్లోనే జరుగుతుంది. ఆయన డైలాగులకు ప్రత్యర్థులు పారిపోతుంటారు, ఒకేసారి పది సుమోలు పైకి లేవడం బాలయ్య సినిమాల్లోనే సాధ్యం. 

27

`సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు`, `పల్నాటి బ్రహ్మానాయుడు`, `సీమసింహం`, `చెన్నకేశవరెడ్డి` వంటి చాలా సినిమాల్లో బాలయ్య లార్జన్‌ దెన్‌ లైఫ్‌ ఇమేజ్‌ కనిపిస్తుంది. ఆయన డైలాగులు, యాక్షన్‌ సీన్లు ఆ రేంజ్‌లో ఉంటాయి. అప్పట్లో ఆడియెన్స్ బాలయ్య సినిమాలను ఊగిపోయి చూసేవాళ్లు. బాలయ్యలోని ఎనర్జీ థియేటర్లలో చూసే ఆడియెన్స్ కి ట్రాన్స్‌ ఫామ్ అయ్యిందా అనేలా ఫ్యాన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. 
 

37

అయితే ఇలాంటి సన్నివేశాలు, డైలాగులపై బాలయ్యకి ప్రశ్న ఎదురైంది. తొడకొట్టి చేయితే ఇలా అంటే ట్రైన్‌ వెళ్లడం వంటివి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందనే ప్రశ్న బాలకృష్ణకి ఎదురైంది. దీనికి ఆయన రియాక్షన్‌ మాత్రం మతిపోవాల్సిందే. నిజానికి బాలయ్య భోళా శంకరుడు, మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాడు, ఓపెన్‌గా ఉంటాడనే పేరు ఉంది. ఈ ప్రశ్నకి కూడా ఆయన చాలా రియలిస్టిక్‌గా స్పందించడం విశేషం. ఇలాంటి సీన్లు చూసినప్పుడు తనకు కూడా ఏంటి ఇది అనిపిస్తుందట. ఇంట్లో వాళ్లు అడుగుతారట. 
 

47

వాళ్లు అన్నప్పుడు నిజమే కదా, తొడకొట్టి చేయి ఇలా అంటే ట్రైన్‌ వెనక్కి వెళ్లిపోవడమేంటి? అని మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్‌ అనిపిస్తుంది. ఒక సిల్లీ ఫీలింగ్‌ అనిపిస్తుంటుందని చెప్పాడు బాలయ్య. అది నిజానికి చాలా టూ మచ్‌ అని, యాక్సెప్ట్ చేసేలా ఉండదు అని తాను దాన్ని కవర్‌ చేసుకోవడం లేదు అని స్పష్టం చేశారు బాలయ్య. 

57

ఈ సందర్భంగా మరో షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఇలాంటి సీన్లు పెట్టాలని, రాయాలని రైటర్స్ ఎందుకు అనుకున్నారో, నేను ఎందుకు ఒప్పుకున్నాను, దర్శకుడు ఎలా తీశారో అంటూ ఆయన సెటైర్లు పేల్చారు. తనపై తానే సెటైర్లు వేసుకున్నారు. ఇకపై తాను నేచురాలిటీకి దగ్గరగా వెళ్తున్నానని, అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నానని తెలిపారు.

67

ఇక డైలాగులకు సంబంధించి తాను ఎంతో కష్టపడతానని, డైలాగుల్లో ఎంతో మీనింగ్‌ ఉంటుందని, చాలా విషయాలు చెప్పాలనుకుంటానని తెలిపారు. డైలాగులు అలా పేలడం వెనుక చాలా కష్టం ఉంటుందని, వాటిని అంతే అనర్ఘళంగా పలికేందుకు మార్నింగ్‌ లేవగానే చుట్ట కాలుస్తానని తెలిపారు. వాయిస్‌ బేస్‌, క్లారిటీ వస్తుందని చెప్పారు. నాన్నగారు అలానే వాయిస్‌ కోసం చుట్ట కాల్చేవారని, తాను కూడా అదే అలవాటు చేసుకున్నానని చెప్పారు. 

77

తన 99వ మూవీ `డిక్టేటర్‌` సినిమా సమయంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన 109 మూవీ చేస్తున్నారు. బాబీ దర్శకుడు. ఇందులో బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నారు. భారీ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతోపాటు బోయపాటి శ్రీనుతో నాల్గో సారి సినిమా చేయబోతున్నారు బాలయ్య. త్వరలోనే ఈ మూవీ కూడా ప్రారంభం కానుందని తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories