తన ఫస్ట్ మూవీ హీరోయిన్‌ని కలిసిన పవన్‌ కళ్యాణ్‌.. 28 ఏళ్ల తర్వాత ఈ అరుదైన కలయికకి కారణం ఏంటంటే?

Published : Jun 24, 2024, 06:41 PM ISTUpdated : Jun 24, 2024, 06:43 PM IST

పవన్‌ కళ్యాణ్‌ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్‌ని కలిశాడు పవన్‌. 

PREV
15
తన ఫస్ట్ మూవీ హీరోయిన్‌ని కలిసిన పవన్‌ కళ్యాణ్‌.. 28 ఏళ్ల తర్వాత ఈ అరుదైన కలయికకి కారణం ఏంటంటే?

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. ఈవీవీ సత్యానారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ చేసే రియల్‌ సాహసాలు హైలైట్‌గా నిలిచాయి. ఆయన తన చేతులపై 25కార్లు వెళ్లనివ్వడం, అలాగే పెద్ద బండరాళ్లని తన బాడీపై పెట్టుకుని పగల గొట్టడం హైలైట్‌గా నిలిచింది. 
 

25

`అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాలో ఆయా సీన్లే హైలైట్‌గా నిలుస్తుంది. అయితే ఇది హీరోయిన్‌తో పందెంలో భాగంగా పవన్‌ కళ్యాణ్‌ చేస్తాడు. పవన్‌ గురించి కాలేజీలో ఫ్రెండ్స్ అంతా అతిగా చెప్పడం, తరచూ పందెలు ఆడుతూ కనిపించడంతో హీరోయిన్‌కి మండి ఆమె పెద్ద పందేలు వేస్తుంది. అదే బండరాళ్లని పగలగొట్టుకోవడం, కార్లని చేతులపై నుంచి వెళ్లనివ్వడం చేస్తాడు పవన్‌. 
 

35

మరి ఇంతకి ఆ హీరోయిన్‌ ఎవరో కాదు సుప్రియ యార్లగడ్డ. ఈ సినిమాతోనే ఇటు పవన్‌, అటు సుప్రియ టాలీవుడ్‌కి జంటగా పరిచయం అయ్యారు. జంటగా నటించి మెప్పించారు. ఆ తర్వాత సుప్రియ సినిమాలకు దూరమయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ స్టార్‌ హీరోగా ఎదిగాడు. పవర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లో విజయం సాధించి, ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యారు. 
 

45

తాజాగా ఈ జంట కలుసుకుంది. సుమారు 28ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలుసుకోవడం విశేషం. ఈ అరుదైన కలయికకి విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయం వేదికైంది. సోమవారం టాలీవుడ్‌ నిర్మాతలు డిప్యూటీసీఎం పవన్‌ కళ్యాణ్‌ని కలిసిన విషయం తెలిసిందే. ఇందులో సుప్రియ కూడా ఉండటం విశేషం. ఆమె కూడా అన్నపూర్ణ స్టూడియో తరఫున నిర్మాతగా పవన్‌ని కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు కలిసి ఫోటో దిగారు. అదిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 28ఏళ్ల తర్వాత కలిసిన `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` జంట అంటూ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇది చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 

55

సుప్రియ ఇప్పుడు నిర్మాతగా రాణిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోని తనే చూసుకుంటుంది. ప్రొడక్షన్‌లోనూ ఇన్‌వాల్వ్ అవుతుంది. నాగార్జునతో నిర్మించే సినిమాల్లో ఆమె ముందుండి చూసుకుంటుంది.  నిర్మాతగా బిజీగా ఉంది. ఆ మధ్య `గూఢచారి` చిత్రంలోనూ ఓ పవర్‌ఫుల్‌ రోల్‌లో మెరిసిన విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories