ఆ ఇంటికి కోడలిగా వెళతా అంటున్న రష్మిక... మరి దేవరకొండకు హ్యాండ్ ఇచ్చినట్లేనా?

First Published May 13, 2021, 2:45 PM IST

రష్మిక కెరీర్ జోరుమీదుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో పాటు కొన్ని బాలీవుడ్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా పట్టేసిన రష్మిక మందాన, గోల్డెన్ లెగ్ బ్రాండ్ సంపాదించారు. 
 

కరోనా ఏడాదిగా ముగిసిన 2020లో కూడా రెండు సూపర్ హిట్స్ ఇచ్చింది రష్మిక. సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే నితిన్ కి జంటగా నటించిన భీష్మ సైతం హిట్ కొట్టింది.
undefined
ఇక అల్లు అర్జున్ కి జంటగా పుష్ప మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషాల్లో పుష్ప విడుదల కానుంది. పుష్ప రెండు పార్ట్స్ గా విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాదాపు రూ 300 వందల కోట్ల బడ్జెట్ వరకు పుష్ప చేరుకుంది.
undefined
ఇక సౌత్ నుండి నార్త్ వరకు అన్ని పరిశ్రమల్లో సినిమాలు చేస్తున్న రశ్మికకు తమిళ పరిశ్రమ అంటే ఎంతో ఇష్టం అట. తమిళ ప్రజలు, వాళ్ళ మర్యాదలు రష్మికను ఆకట్టుకున్నాయట. ముఖ్యంగా తమిళ వంటకాలు అంటే తనకు ఇష్టం అని, తమిళనాడు కోడలిగా రావాలని అనుకుంటున్నానని ఆమె చెప్పడం అందరినీ షాక్ గురిచేసింది.
undefined
కన్నడ అమ్మాయి అయిన రష్మిక తమిళ ఇంటి కోడలు అవుతానని అనడంలో మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. ఒకవేళ ఇప్పటికే రష్మిక ఎవరినో భర్తగా సెలెక్ట్ చేసుకున్నారేమోనన్న అనుమానం కూడా కలుగుతుంది.
undefined
మరోవైపు విజయ్ దేవరకొండకు రష్మిక పరోక్షంగా హ్యాండ్ ఇచ్చినట్లేనా అని కొందరు వాపోతున్నారు. కొన్నాళ్లుగా రష్మిక విజయ్ దేవరకొండతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇద్దరు నైట్ డిన్నర్లు, షాపింగ్స్  కలిసి చేస్తున్నారు.
undefined
విజయ్ దేవరకొండ కుటుంబంలో జరిగిన కొన్ని వేడుకలకు కేవలం రష్మిక మాత్రమే హాజరు కావడం వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్తలకు ఊతం ఇచ్చింది. మరి ఇప్పుడేమో రష్మిక తమిళ ఇంటికి కోడలు అవుతాననడంతో తెలుగు అబ్బాయి విజయ్ కి హ్యాండ్ ఇచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
undefined
గతంలో కూడా ఓ హీరోకి రష్మిక బ్రేకప్ చెప్పారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డ రష్మిక అతనితో ఎంగేజ్మెంట్ కూడా జరుపుకుంది. పెళ్లికి ముందు అతనికి బ్రేకప్ చెప్పి, కెరీర్ ఫై ఫోకస్ పెట్టింది.
undefined
click me!